Begin typing your search above and press return to search.

మంత్రుల ట్వీట్లు ఓకే...మరి ఎమ్మెల్యేలు క్యాడర్ పట్టించుకోవడంలేదా...?

By:  Tupaki Desk   |   27 Sep 2022 10:33 AM GMT
మంత్రుల ట్వీట్లు ఓకే...మరి ఎమ్మెల్యేలు క్యాడర్ పట్టించుకోవడంలేదా...?
X
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయ రచ్చ ఒక రేంజిలో సాగుతోంది. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఎన్టీయార్ హెల్త్ వర్శిటీకి సడెన్ గా ఎన్టీయార్ పేరు తీసేసి వైఎస్సార్ పేరుని పెట్టేసింది జగన్ ప్రభుత్వం. దాంతో తన పార్టీ మూల పురుషుడు ఎన్టీయార్ కి తీరని అపచారం జరిగింది అంటూ టీడీపీ పెద్ద ఎత్తున రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో అయితే టీడీపీ బ్యాచ్ పెద్ద ఎత్తున ఇదే విషయం మీద వైసీపీఎని ఎండగడుతోంది.

అదే సమయంలో వైసీపీ నుంచి మంత్రులు రంగంలోకి టీడీపీ వారికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. అంబటి రాంబాబు నుంచి రోజాతో మొదలుపెడితే జోగి రమేష్, మేరుగ నాగార్జున వంటి మంత్రులు ఈ విషయంలో జోరు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీయార్ కుమారుడు బాలయ్య వైసీపీ సర్కార్ కి యాంటీగా ట్వీట్ చేస్తే దాని మీద వైసీపీ మంత్రులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఇలా అఫెన్సిఫ్ మోడ్ లో వైసీపీ మంత్రులు ఉంటే మరి మిగిలిన పార్టీ పెద్దలు ప్రభుత్వ పెద్దలు ఎక్కడ ఉన్నారు అన్న చర్చ వస్తోంది.

వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కొందరు మంత్రులు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. ఈ సంఖ్య టోటల్ గా పది లోపు అనుకుంటే మిగిలిన మంత్రుల‌తో పాటు ఎమ్మెల్యేల సంగతి ఏంటి అన్నదే ఇపుడు హాట్ హాట్ టాపిక్ గా వైసీపీలో ఉంది. మంత్రుల స్థాయిలో వారు రియాక్ట్ అవుతారు. ప్రతీ జిల్లాకు ఆయా మంత్రులు ఉన్నారు. వారు జిల్లా లెవెల్ లో రిటార్ట్ ఇస్తారు మరి నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు స్పందించాలి కదా అన్నదే వైసీపీలో అంతర్మధనంగా ఉందని అంటున్నారు.

మరి ఇది తమ బాధ్యత కాదు అనుకున్నారా లేక తమకెందుకొచ్చిన తంటా అని భావిస్తున్నారా ఏమో తెలియదు కానీ ఎమ్మెల్యేలు అయితే గప్ చుప్ అయ్యారని అంటున్నారు. అలాగే పార్టీలో వివిధ హోదాలో ముఖ్యులు ఉన్నారు. అదే విధంగా పార్టీలో కీలక నేతలు ఎంతో మంది ఉన్నారు. వారు సైతం గమ్మున ఉన్నారుల్ ఇక క్యాడర్ విషయం అయితే అసలు ఈ రచ్చతో తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగానే ఉందని అంటున్నారు.

ఒక విధంగా వైసీపీలొ సోషల్ మీడియాలో టీడీపీ చెడుగుడు ఆడుతూంటే అధికార పార్టీ తమ వైపు నుంచి క్యాడర్ పోస్టులు పెడుతూ రఫ్ఫాడించాల్సి ఉండగా అంటీ ముట్టనట్లుగా ఉంటోంది. దీంతో సోషల్ మీడియా సమరంలో టీడీపీ పై చేయిగా సత్తా చాటుతోంది. ఇక ఐటీడీపీ అయితే అతి ఉత్సాహాం చూపిస్తున్నారు.

ఎక్కడ లేని యాంటీ వైసీపీ వీడియోలు తెచ్చి రచ్చ చేస్తోంది. అంతే కాదు వీలైనంతగా బదనాం చేస్తోంది. దానికి ఎపుడో ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఒక చానల్ చేసిన ఇంటర్వ్యూను బయటకు తీసి తమకు కావాల్సిన దాన్ని ఎడిట్ చేసి వదిలారు. ఇలాంటివి చాలానే ఐటీడీపీ చేస్తోంది. మరి వారి దూకుడుతో పోల్చుకుంటే వైసీపీ వారిలో ఉత్సాహం ఏ కోశానా కనిపించడంలేదనే అంటున్నారు. పూర్తిగా నీరు కారిపోతున్నారు, నిస్సారం అవుతున్నారు అని అంటున్నారు.

ఫలితంగా వర్శిటీ పేరు మార్పు వ్యవహారాన వైసీపీ వాదన తప్పో రైటో ఏదైనా సరే జనాలకు పెద్దగా చేరడంలేదని కూడా చెబుతున్నారు. మరి వైసీపీ వారిలో ఎందుకింత నిరాశ, ఎందుకింత నిర్లిప్తత అన్నది కూడా అర్ధం కావడంలేదు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీకి సొంత పార్టీలోనే పూర్తి స్థాయిలోనే సహాయ నిరాహరణ మొదలైంది అన్న మాట వినిపిస్తోంది. ఇది సోషల్ మీడియా సమరం సాక్షిగా బయటపడింది అని అంటున్నారు. ఇపుడే ఇక్కడే చేతులెత్తిస్తే అసలు యుద్ధంలో పరిస్థితి ఎలా ఉంటుందో అన్నదే చర్చగా ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.