ఇద్దరు మంత్రులు... మూడేసి ఆఫీసులు

Thu Oct 06 2022 20:23:48 GMT+0530 (India Standard Time)

Ministers Rajini and Amarnath Maintaining Three Offices

వైసీపీ సర్కార్ లో మంత్రులు ఇద్దరున్నారు.  వారిది ప్రత్యేకమైన స్టైల్ అని అంటున్నారు. ఆ ఇద్దరు మంత్రులకు ఏకంగా చెరి మూడేసి వంతున ఆఫీసులు ఉన్నాయి. వారే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని. ఈ ఇద్దరు మంత్రులకు సచివాలయంలో విశాలమైన చాంబర్లు ఉన్నాయి. వాటిని తాము కోరుకున్న తీరున ప్రభుత్వ ఖర్చుతో ఆధునీకరించుకున్నారు కూడా.అయినా సరే సచివాలయానికి ఈ  మంత్రులు రారు. ఈ ఇద్దరే కాదు చాలా మంది మంత్రులు రారు. కేవలం నలుగురైదుగురు మంత్రులు మాత్రమే అలా వచ్చి వెళ్తారు ముఖ్యమంత్రి ఎటూ సచివాలయానికి రావడంలేదు ఆయన నివాసాన్ని క్యాంప్ ఆఫీస్ గా మార్చుకుని అక్కడే సమీక్షలు అన్నీ చేస్తున్నారు. దాంతో తాము కూడా సచివాలయానికి ఎందుకు అన్నట్లుగా వైసీపీ మంత్రులు ఆ వైపుగా కూడా రావడంలేదు.

దాంతో వందల కోట్లతో కట్టిన సచివాలయం మంత్రులు లేక అలా వెలవెలబోతోంది. ఇక మంత్రులు రాకపోతే వారి కార్యదర్శులు ఇతర ఉద్యోగులు కూడా సచివాలయానికి రావడం తగ్గించేశారు. అదంతా మొక్కుబడి హాజరుగానే ఉంటోంది. ఇవన్నీ పక్కన పెడితే మంత్రులకు వేరేగా క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి.

ఇక గుడివాడ అమరనాధ్ విడదల రజనీ విషయానికి వస్తే ఈ ఇద్దరికీ కూడా క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి. వాటితో పాతు ప్రత్యేకంగా మంగళగిరిగిలఒని ఏపీఐఐసీలో చాంబర్లను ఏర్పాటు చేయించుకున్నారు. అక్కడ నుంచే ఈ ఇద్దరు మంత్రులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. దీంతో ఏపీఐఐసీకి పెను భారం లక్షలలో  నెలకు ఖర్చులు అవుతున్నాయి అంటున్నారు.

ఇదంతా కూడా ప్రజాధనమే. ప్రజలకు సేవ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వారికి మర్యాదలకు తక్కువ లేకుండా సచివాలయంలో చాంబర్లు కట్టినా ఇలా వేరేగా ఆఫీసులు తీయడం వాటి ఖర్చు తడిసి మోపెడుగా పెట్టి సర్కార్ ఖర్చులో రాసేయడం న్యాయమా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ ఇద్దరు మంత్రులు తమ ఆఫీసులను ఏపీఐఐసీ నుంచి తీసేయాలని కోరుతున్నారు.

అంతే కాదు ఈ ఇద్దరు మంత్రులతో సహా అందరి మంత్రులు సచివాలయానికి తప్పనిసరిగా హాజరుకావాలని కూడా కోరుతున్నారు. ఇదిలా ఉండగా మంత్రులంతా తప్పనిసరిగా సచివాలాయనికి వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికి అనేకసార్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సర్క్యులర్స్ కూడా జారీ చేసినా కూడా ఎందుకో మంత్రులు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఎవరికి వారే తమ నివాసాలనే క్యాంప్ ఆఫీసులుగా చేసేస్తున్నారు. గుడివాడ రజనీ లంటి వారు అయితే మూడవ ఆఫీస్ కూడా కావాలని అంటున్నారు. మరి ఇదంతా ప్రజా సేవేనా లేక ప్రజా సొమ్ము దుబారా చేయడమా అంటే ఈ మంత్రులు ఏమి చెబుతారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.