Begin typing your search above and press return to search.

అన్న పార్టీ నుంచి ఫస్ట్ అటాక్...?

By:  Tupaki Desk   |   25 Sep 2022 3:57 AM GMT
అన్న పార్టీ నుంచి ఫస్ట్ అటాక్...?
X
రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనుకున్నా కూడా బంధాలు రక్త సంబంధాలు అని అనుకున్నపుడు మాత్రం కొన్ని చిత్రంగా తోస్తాయి. అయినా ఇపుడు రాజకీయాల్లో ఎవరి తోవ వారిదే. అందువల్ల దారులు వేరైనపుడు రాజకీయ విమర్శలు కూడా అలాగే వస్తాయి. వైఎస్ షర్మిల 2019 ఎన్నికల వేళ అన్న జగన్ని సీఎం చేయాలనుకున్నారు. పట్టుదలగా ఏపీ అంతటా తిరిగారు. మొత్తానికి జగన్ సీఎం అయ్యారు. ఆ తరువాతనే తేడా ఎక్కడో కొట్టినట్లుంది.

కొన్నాళ్ళు మౌనంగా ఉన్న చెల్లెమ్మ ఆ తరువాత వైఎస్సార్టీపీ అంటూ తెలంగాణాలో పార్టీ పెట్టి అక్కడ తన లక్ ని పరీక్షించుకుంటున్నారు. అయితే అన్నను చెల్లెలు ఎపుడూ బాహాటంగా డైరెక్ట్ గా విమర్శించలేదు. ఇద్దరి మధ్య ఎడం ఉందని జనాలు అనుకున్నా కూడా నోరు విప్పి ఎవరూ మరొకరిని ఏమీ అనుకోలేదు. కానీ మొదటిసారి ఏపీ రాజకీయాల మీద అందునా జగన్ కీలకమైన నిర్ణయం మీద వైఎస్ షర్మిల ఘాటుగానే రియాక్ట్ అయింది.

విజయవాడలోని ఎన్టీయార్ హెల్త్ వర్శిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టడం మీద ఆమె కామెంట్స్ చేశారు. అలా చేయడం తప్పు అని కూడా ఖండించారు. దీని వల్ల ఒకరి గౌరవం వేరొకరిని ఇవ్వాలనుకునే ఉద్దేశ్యమే తప్పు అని కూడా స్పష్టం చేశారు. దాని మీద మంత్రి జోగి రమేష్ ఫస్ట్ టైమ్ అటాక్ చేశారు. షర్మిల జగన్ చెల్లెలు అని తెలుసు. అయినా మెత్తగానే చెప్పాల్సినవి చెప్పారు.

ఆమె జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం వింటే అలా అని ఉండేవారు కాదని కూడా జోగి రమేష్ చెప్పుకొచ్చారు. అయినా ఆమె తెలంగాణాలో ఉన్నారు. అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమో అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. ఏది ఏమైనా షర్మిల జగన్ నిర్ణయాన్ని విమర్శించి విపక్షాన్నికి ఆయుధాన్ని ఇచ్చారు. దాంతో వైసీపీలో కొంత ఆవేదన ఉంది.

దాన్ని మంత్రి జోగి రమేష్ తన కౌంటర్ ద్వారా ఎంతో కొంత బ్యాలన్స్ చేసే ప్రయత్నం చేశారని అనుకోవాలి. అయినా ఫస్ట్ టైమ్ కాబట్టి ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు ఆమె అలా అని ఉండవచ్చు అని సర్దుబాటు వైఖరితో మాట్లాడినా ఇక్కడ అర్ధమయ్యే విషయం ఏంటి అంటే జగన్ సర్కార్ మీద ఎవరు విమర్శ చేసినా ఆఖరుకు చెల్లెలు అన్నా కూడా కౌంటర్ ఇవ్వడానికి ఆ పార్టీ తయారుగా ఉంది అని. మరి షర్మిల అంతటితో ఆగుతారా లేక ఏపీ సర్కార్ మీద ఫ్యూచర్ లో ఏమైనా విమర్శలు చేస్తారా అన్నది చూడాలి. దాన్ని బట్టే భవిషత్తులో వైసీపీ నుంచి కూడా విమర్శలు పదును తేరుతాయనే అంటున్నారు.