Begin typing your search above and press return to search.

విదేశాలకు ఎగిరిపోతున్న 'భారతీయులు'..!

By:  Tupaki Desk   |   25 Jan 2023 5:00 AM GMT
విదేశాలకు ఎగిరిపోతున్న భారతీయులు..!
X
విదేశాలకు వలస వెళుతున్న వారి జాబితాలో అగ్రస్థానంలో భారతీయులు నిలుస్తున్నారు. విదేశాల్లోని మెరుగైన జీవనం.. ఉద్యోగ అవకాశాల కోసం అక్కడి వెళ్లడం కామనే అయినప్పటికీ ఈ లిస్టులో భారతీయులు ముందంజలో ఉండటం గమనార్హం. తద్వారా భారత్ కు చెందాల్సిన మేథో సంపద విదేశాల్లో క్రమంగా స్థిరపడి పోతుందనే ఆందోళన నెలకొంది.

విదేశాల్లో స్థిరపడిన వారి ద్వారా భారత్ కు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుస్తుంది. ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదపడుతోంది. అయితే భారతీయులు క్రమంగా విదేశాల్లోనే స్థిరపడి పోవాలని భావిస్తుండటం మాత్రం రాబోయే రోజుల్లో ఒకింత ఇబ్బందులు తెచ్చే అవకాశం లేక పోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఏడాదిలో విదేశాలకు వెళ్తున్న వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 'ఇంటర్నేషనల్‌ మైగ్రాంట్‌ స్టాక్‌-2019' నివేదిక ప్రకారంగా విదేశాలకు వలస వెళ్తున్న వారిలో భారతీయులే ముందంజలో ఉన్నారు.

ఐరాస ఆర్థిక.. సామాజిక వ్యవహారాల విభాగం తయారు చేసిన ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి వలస వెళ్లిన వారి సంఖ్య 272 మిలియన్లకు చేరిందింది.

అన్ని దేశాల్లోని ప్రజల వయస్సు.. ప్రాంతం తదితర అంశాల పరిగణలోకి తీసుకొని ఇంటర్నేషనల్‌ మైగ్రాంట్‌ స్టాక్‌-2019 ఈ జాబితాను తయారు చేసింది. ఈ జాబితాలో అంతర్జాతీయంగా వలస వెళ్లిన వారిలో మూడో వంతు ప్రజలు పది దేశాలకు చెందిన వారు ఉన్నారని తేలింది. 2019లో ఇప్పటివరకు భారత దేశానికి చెందిన 1.75 కోట్ల మంది విదేశాల్లో సిర్థపడినట్లు వెల్లడించింది.

ఈ జాబితాలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. భారతీయులు ఎక్కువగా యూఏఈ.. అమెరికా..సౌదీ అరేబియాకు ఎక్కువగా వలస వెళుతున్నట్లు వెల్లడైంది. ఇక ఆ తర్వాతి దేశాల్లో 1.18 కోట్ల మందితో మెక్సికో.. 1.07 కోట్ల మందితో చైనా ఉన్నాయి. రష్యా నాలుగు.. సిరియా ఐదు.. బంగ్లాదేశ్ ఆరు.. పాకిస్థాన్‌ ఏడు.. ఉక్రెయిన్‌ ఎనిమిది.. ఫిలిప్పీన్స్‌ తొమ్మిది.. అఫ్గానిస్థాన్‌ 10 స్థానాల్లో ఉన్నాయి. కాగా భారత్‌ 2019లో 51 లక్షల మంది విదేశీయులకు ఆశ్రయం కల్పించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.