Begin typing your search above and press return to search.

ఆకాశంలో అర్ధరాత్రి వింత ... ఏలియన్స్ వచ్చారా?

By:  Tupaki Desk   |   22 Jun 2021 9:52 AM GMT
ఆకాశంలో అర్ధరాత్రి వింత ... ఏలియన్స్ వచ్చారా?
X
మనం భూ గ్రహం పై నివసిస్తున్నట్లుగానే ఇతర గ్రహాల మీద కూడా ఏమైనా ప్రాణాలు ఉన్నాయా, వేరే గ్రహాల మీద జీవరాసులు మన గ్రహం మీద టార్గెట్ చేశారా, మనకన్నా ఎన్నో వేల రేట్లు అడ్వాన్స్ గా ఉన్న ఆ జీవులు మన గ్రహం మీదకి వచ్చి వెళ్తాయా, భూమి మీద గుర్తు తెలియని ఎగిరే వాహనాలు దేనికి సంకేతం, అసలు ఏలియన్స్ ఉన్నారా , ఉంటే ఎప్పుడు ఎలా వస్తారు.. ఎలా ఉంటారు.. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉంది. మన దేశంలో ఏలియన్స్ లేదా ఎగిరే వస్తువులు కనిపించడం అరుదే కాగా అమెరికా లాంటి దేశాలలో అవి ఎప్పటికప్పుడు కనిపించడంతో పాటు అక్కడ పరిశోధనలు ఎక్కువే.

అయితే , తాజాగా మన దేశంలో కూడా అలాంటి చర్చ మళ్ళీ వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే .. గుజరాత్ లో రాత్రి సమయంలో ఆకాశంలో కనిపించిన దృశ్యం. గుజరాత్‌లోని జునాగఢ్ నగరంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆకాశంలో వింత కాంతి కనిపించింది. అంతకు ముందెన్నడూ కనిపించని ఆ కాంతిని ప్రజలంతా ఆశ్చర్యపోయి చూశారు. కొంత మంది అది ఉల్క కావచ్చు అన్నారు. మరికొందరు హెలికాప్టర్ కావచ్చు అన్నారు. కొంతమంది మాత్రం UFO అన్నారు. చాలా మంది దాన్ని చూసేందుకు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. రంగు రంగుల్లో మెరుస్తూ ఆ కాతి కనిపించింది. కొంతసేపటి తర్వాత అది ఉల్క కాదనీ... ఉల్కే అయితే... అంతసేపు ఆకాశంలో స్థిరంగా ఉండదని తేల్చారు. మరైతే... అది తారాజువ్వ కావచ్చా అంటే... తారా జువ్వ కూడా క్షణాల్లో కింద పడిపోతుంది కాబట్టి... అది తారాజువ్వ కూడా కాదు అని అనుకున్నారు.4 లైట్లతో ఉన్నట్లుగా కనిపించిన ఆ కాంతి... ఆకాశంలో చక్కర్లు కొట్టింది. దాన్ని చాలా మంది వీడియోలు తీశారు. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అది ఏంటి అనేది మాత్రం మిస్టరీగా ఉండిపోయింది.