Begin typing your search above and press return to search.

మెలానియా సూట్ వెనుక ఇంత స్టోరీ ఉందా?

By:  Tupaki Desk   |   24 Feb 2020 5:23 PM GMT
మెలానియా సూట్ వెనుక ఇంత స్టోరీ ఉందా?
X
అమెరికా ప్ర‌థ‌మ దంప‌తులు డొనాల్డ్ ట్రంప్‌ - మెలానియా భార‌త ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కంటే ఆయ‌న‌ సతీమణి మెలానియా ట్రంప్ గురించే పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. విమానం నుంచి దిగుతున్న స‌మ‌యం నుంచి మెలానియా ట్రంప్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్రంప్‌ నలుపు రంగు షూట్‌ ధరించగా.. మెలానియా మాత్రం తెలుపు రంగు దుస్తులను ధరించి.. అందరినీ ఆకర్షింపజేశారు.

మెలానియా ధరించిన వస్త్రాలను డిజైన్ చేసింది ప్రముఖ ఫ్రాన్స్ డిజైనర్ హర్వ్ పియర్. ప్ర‌థ‌మ మ‌హిళ డ్రస్సు గురించి హర్వ్ పియర్ వివరించారు. డ్రస్‌ పై ఉన్న గ్రీన్ కలర్ క్లాత్‌ కు భారత్‌ కు సంబంధం ఉందని చెప్పారు. దీన్ని గ్రీన్ సిల్క్‌ తో తయారు చేయడం జరిగిందన్నారు. ఈ వస్త్రం గ్రీన్ కలర్ సిల్క్‌ తో తయారు చేయబడిందని దానిపై బంగారంతో కూడిన త్రెడ్ వర్క్ చేసినట్లు చెప్పారు. ఇదొక వింటేజ్ పీస్‌ గా హర్వ్ పియర్ అభివర్ణించారు. కాగా, సూర్యాస్త‌మ‌య వేళ‌.. ట్రంప్ ఫ్యామిలీ యూపీలోని ఆగ్రాలో ఉన్న ఆ ముగ్ధ‌మ‌నోహ‌ర ప్రేమ చిహ్నమైన తాజ్‌మ‌హ‌ల్‌ను సంద‌ర్శించారు.

మ‌రోవైపు, మొతెరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో భర్త జారెడ్ కుష్నర్‌ తో క‌లిసి ట్రంప్ కూతురు ఇవాంకా పాల్గొన్నారు. అధ్యక్షుడి సలహాదారు అయిన ఇవాంక రంగు రంగుల పూలతో తయారు చేసిన మిడ్డీ డ్రెస్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె వేసుకున్న డ్రెస్‌ కు పెట్టిన ఖర్చు గురించి జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఆమె విమానం దిగిన దగ్గర నుంచి తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఇవాంక ధరించిన డ్రెస్‌ భారత కరెన్సీలో రూ.1.7లక్షలు కావడం విశేషం. గతంలో 2019లో అర్జెంటీనా వెళ్లినప్పుడు చివరిసారిగా ఆమె ఈ డ్రెస్‌ ధరించారు. స్టన్నింగ్‌ ఔట్‌ ఫిట్‌ తో వచ్చిన ఇవాంక స్టేడియంలో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు.