చిరు దూకుడు - మోడీతో భేటీ!

Wed Oct 16 2019 17:42:46 GMT+0530 (IST)

సినిమాల్లో రెండో ఇన్సింగ్స్ తో మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ’సైరా‘ చాలా ఆలస్యంగా ప్రారంభించినా... సక్సెస్ ఫుల్ గా ముగించి అందరి అభినందనలు అందుకుంటున్నారు చిరంజీవి. అయితే... సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో ఆగిపోకుండా... దానిని మరింత పెద్ద హిట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో చారిత్రక సాంఘిక నేపథ్యం ఉన్న ఆ సినిమా ద్వారా తన పరిచయాలను సుదృఢం చేసుకోవడానికి చిరంజీవి ఆసక్తికరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ అపాయింట్ మెంట్ అడిగి ఆయనను కలిసి పవన్ తో పాటు అందరికీ షాకిచ్చారు. ఇపుడు తాజాగా మరో ఇంపార్టెంట్ అప్ డేట్ వినిపిస్తోంది.చిరంజీవి.. ప్రధాని మోడీ - హోంమంత్రి అమిత్ షా అపాయింట్ కోరారు. ఇది ఖరారైంది. బీజేపీ నేత సీఎం రమేష్ వారికి ఈ ఏర్పాట్లు చేసిపెట్టారు. ఇప్పటికే చిరంజీవి ఢిల్లీ చేరుకున్నారు. ఈ సడెన్ అప్ డేట్ తో మెగా అభిమానులు సర్ ప్రైజ్ అయ్యారు. బీజేపీ నియమించిన తెలంగాణ గవర్నర్ అయిన సౌందరరాజన్ ని ఇటీవలే కలిసి సినిమా గురించి చెప్పారు చిరంజీవి. తర్వాత మోడీతో సయోధ్యగా ఉన్న జగన్ ను కలిశారు. ఇపుడు మోడీ షాలను కలుస్తున్నారు. అంటే... అంత కరెక్టుగా ఒక లైన్లో సాగుతుందనుకోవాలి.

తాజా వివరాలు ప్రకారం... ముందు ప్రధాని మోడీని చిరంజీవి కలుస్తారు. ఆయనతో మర్యాద పూర్వక భేటీ అనంతరం స్వాతంత్రోద్యమ నేపథ్యంలో తీసిన చిత్రం కాబట్టి ఒక సారి వీలుచూసుకుని సైరా సినిమా చూడాలని చిరంజీవి కోరతారట. మోడీతో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు.  మరి వారికి ఎంతవరకు కుదురుతుందో తెలియదు గాని... తరచూ తెలుగు సినిమాలు చూడటానికి ఇష్టపడే.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాత్రం .... సాయంత్రం  ‘సైరా’ సినిమాను వీక్షించనున్నారు. చిరంజీవి కూడా ఆయనతో కలిసి సినిమా చూడనున్నారు.