Begin typing your search above and press return to search.

ఎన్నో రోగాలకు ఇదే ఆద్యం.. జాగ్రత్త అవసరం..

By:  Tupaki Desk   |   7 Feb 2023 5:00 AM GMT
ఎన్నో రోగాలకు ఇదే ఆద్యం.. జాగ్రత్త అవసరం..
X
ఇప్పుడున్న బిజీ వాతావరణంలో ప్రతీ ఒక్కరికి రిలాక్స్ దొరకడం కష్టంగానే మారింది. సంపాదన మోజులో పడి చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఏ వృత్తిలో ఉన్నా తలనొప్పి సహజం. దీని నుంచి తట్టుకోవడానికి ఏవేవో టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. తాత్కాలికంగా ఇవి ఉపశమనం లభించినా దీర్ఘకాలికంగా సమస్య మాత్రం తీరదు.

తలనొప్పిని చాలా మంది చిన్న సమస్య అనుకుంటారు. కానీ ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. మాములు తలనొప్పి నుంచి వ్యాధి తీవ్రతను పెంచే కారకంగా మారుతుంది. అందువల్ల తీవ్రమైన తలనొప్పి సంభవించినప్పుడు దీని నివారణకు శాశ్వత మార్గాలను ఎంచుకోవాలి. అయితే తలనొప్పి రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి తీవ్రమవుతుంది. ముందుగా మూమలుగా ఉన్నా క్రమంగా ఇది భరించలేని నొప్పిగా మారుతుంది. అయితే కొందరు ఇలాంటి సమయంలో పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలా తలనొప్పి తీవ్రంగా మారి నిద్రపట్టకుండా మారుతుంది. మనసు హాయిగా ఉన్నప్పుడే ప్రశాంతమైన నిద్ర ఉంటుంది. తలనొప్పితో కళ్లు మూసుకున్నా కలత నిద్రే ఉంటుంది. ఈ సమస్య తీవ్రమై శరీరానికి తీవ్ర అలసటను తెప్పిస్తుంది.

సరైన నిద్ర లేకపోవడం వల్ల జీర్ణాశయ సమస్యలు ఎదురవుతాయి. పొట్టలో గ్యాస్ ఏర్పడిన జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే ఇది తలనొప్పి కారణంగా సరిగా నిద్రించకపోతే గ్యాస్ సమస్యలు వస్తాయి.

ఆ తరువాత జీర్ణ సమస్యలు మరీ ఎక్కువై ఇతర వ్యాధులు సంక్రమిస్తాయి. ఇక బరువు తగ్గడానికి ఎక్కువగా కష్టపడుతుంటారు. ఇలా స్థాయికి మించి కష్టపడడంతో తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒత్తిడి కారణంగా విపరీతమైన తలనొప్పి వచ్చి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి.

తలనొప్పిగా సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొన్ని లవంగాలను వేయించి ఒక గుడ్డలో వేసుకోవాలి. అందులో నుంచి వచ్చే వాసనను పీలిస్తే తాత్కాలికంగా ఉప శనమనం అవుతుంది. అలాగే పూదీన టీ ద్వారా తలనొప్పి నివారణ అవుతుంది. అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల తలనొప్పి రాకుండా అడ్డుకోవచ్చు



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.