జనవరి నుంచి టీడీపీకి 5 ఛానెళ్లు.. జనసేనకు 3 ఛానెళ్లు

Thu Sep 29 2022 23:59:15 GMT+0530 (India Standard Time)

Media To Support AP Political Partys

ఎన్నికల సందడి ప్రారంభమైంది. గెలిచి తీరాలనే కసితో ఉన్న పార్టీలు ఏపీలో జోరు పెంచాయి. అదేసమ యంలో అధికారంలోకి వచ్చేయాలనే కసితో టీడీపీ ఉంది. అదేవ్యూహాన్ని జనసేన పార్టీఅధినేత పవన్ కూడా అవలంభిస్తున్నారు. వెరసి.. రాజకీయంగా.. ఏపీ వేడెక్కుతోంది. మరీ ముఖ్యంగా..వచ్చే ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను ముందుగానే.. అమల్లో పెడుతున్నారు. టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. ఇప్ప టికే చంద్రబాబుజోరు పెంచారు.నాయకులను సమీకరిస్తున్నారు. నాయకులను ఏకం చేస్తున్నారు. అదేసమయంలో నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు కూడా చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఇదిలావుంటే.. దీనికి ముందుగానే..నారా లోకే ష్.. పార్టీని ముందుకు నడిపించేలా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా.. సంక్రాంతి తర్వాత.. పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 450 రోజుల పాటు..నిర్వహించాలని నిర్ణయించు కున్న ఈ యాత్ర ద్వారా.. ప్రజలను కలవనున్నారు.

ఇక జనసేన విషయాన్ని పరిశీలిస్తే.. ఆ పార్టీ కూడా.. ప్రజలను కలవుంది. అయితే.. ఇప్పటికే బస్సు యా త్ర చేయాలని నిర్ణయించుకున్నా.. అనూహ్యంగా జనసేనాని దీనిని వాయిదా వేసుకున్నారు.

అయితే.. త్వరలోనే.. ఆయన ప్రజల్లోకి రావడం.. నియోజకవర్గాల్లో పర్యటనలు చేయడం.. కూడా ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంతైనా..ప్రచారం ముఖ్యం కదా.. వాస్తవానికి అటు చంద్రబాబు.. ఇటు పవన్.. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా.. ఫాలోయింగ్ ఉంటోంది.

అయితే.. దీనికి మించి.. అన్నట్టుగా.. ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్లాలంటే.. మరింత.. మీడియా దన్ను అవసరమనే భావన ఉంది. ఈ క్రమంలోనే ఏకంగా.. టీడీపీకి ఐదు ఛానళ్లు.. జనసేనకు 3 ఛానళ్లు సపోర్టు చేసేందుకు రెడీగా ఉన్నాయని తెలుస్తోంది.  

లోకేష్ పాదయాత్రను లైవ్‌లో ప్రసారం చేయడం.. ద్వారా.. ఆయనకు మరింత మద్దతు కూడగట్టేందుకు రెడీ అవుతున్నారు. అదేవిధంగా.. జనసేన అధినేత నిర్వహించే యాత్రకు కూడా కవరేజీ కోసం.. ప్రత్యేకంగా చానళ్లుబుక్ చేసుకుంటున్నారట. మరి.. దీనిని బట్టి.. ఈ రెండు పార్టీలు ఏ రేంజ్‌లో దూసుకుపోతాయో.. అనే చర్చ జరుగుతోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.