ఒక మీడియా అధినేత వెల్లడించిన సంచలన నిజం

Tue May 21 2019 10:25:47 GMT+0530 (IST)

Media Owner Sensational Comments on Exit Polls

పోల్ సర్వే ఫలితాలు సండే సాయంత్రం విడుదల కావటం తెలిసిందే. మోడీకి వ్యతిరేక గాలి వీస్తుందన్న మాటలకు భిన్నంగా.. అన్ని సర్వేల్లోనూ మళ్లీ ఆయన ప్రధాని కావటం ఖాయమన్నట్లుగా తేల్చాయి. పేపరు.. పెన్ను తీసుకొని లెక్కలు వేసుకున్నా.. సర్వేల్లో చెప్పిన అంకెలతో సరిపోలని పరిస్థితి.మోడీ గాలి ఎలా వీసిందన్న దానిపై కొందరు కమలనాథులు తమ వాదనను వినిపించినా.. పాత్రికేయుల్లో మాత్రం సందేహాలు భారీగానే నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. జాతీయ స్థాయిలో సుపరిచితుడైన ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేత ఒకరు తన సన్నిహితులతో అన్న మాట ఒకటి ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. సర్వే ఫలితాల్ని వెల్లడించిన సంస్థల్లో ఆయన కూడా ఒకరు.

ఆయన మీడియా సంస్థ వెల్లడించిన సదరు ఎగ్జిట్ పోల్ ను పలువురు కోట్ చేసేంత ప్రముఖ సంస్థగా దాన్ని చెప్పొచ్చు. అలాంటి ఆయన మాట్లాడుతూ.. మోడీకి సానుకూలంగా అన్నేసి సీట్లు ఎలా సాధ్యమంటే.. ఓ యాభై నుంచి డెబ్బై వరకు అదనంగా అంకెలు కలిపితే రాకుండా ఉంటాయా? అన్న మాటను మాట్లాడినట్లుగా  తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా స్వేచ్ఛగా నిజాలు రాసే పరిస్థితి లేదని.. ఓటరు నాడి మీద అయోమయం నెలకొన్న వేళ.. రిస్క్ తీసుకునే కన్నా.. సేఫ్ గేమ్ ఆడటం మంచిదన్న ఉద్దేశంతోనే తమ సర్వే ఫలితాలకు అదనంగా యాభై నుంచి డెబ్బై వరకు సీట్లు కలిపినట్లుగా వ్యాఖ్యానించిన వైనం మీడియా వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

మీడియా ఇప్పుడు సిత్రమైన పరిస్థితుల్లో నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు.

చూస్తూ.. చూస్తూ గొడవలు పెట్టుకునే దమ్ము.. ధైర్యం ఎవరికి లేదని.. విలువలున్న నేతలతో గేమ్ ఆడేందుకు మీడియా ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది కానీ.. అందుకు భిన్నమైన మైండ్ సెట్ తో ఉన్న వారితో ఆటలు ఆడే అలవాటు భారత మీడియాకు ఈ మధ్య కాలంలో ఎదురుకాలేదన్న మాట ఆయన నోటి నుంచి రావటం గమనార్హం. అయితే.. ఈ వ్యాఖ్యలో నిజం ఎంతన్నది ఓట్ల లెక్కింపు తర్వాతే తేలుతుందని చెప్పక తప్పదు.