Begin typing your search above and press return to search.

అలాస్కాలో భారీ భూకంపం..పొంచివున్న సునామీ ముప్పు..?

By:  Tupaki Desk   |   29 July 2021 10:15 AM GMT
అలాస్కాలో భారీ భూకంపం..పొంచివున్న సునామీ ముప్పు..?
X
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి భూకంపం అందరిని భయాందోళనకి గురిచేసింది. అమెరికాలోని అలాస్కాలో జులై 28 న భారీ భూకంపం చోటుచేసుకుంది. అలాస్కాలో వచ్చిన రిక్టర్‌ స్కేలు పై భూకంప తీవ్రత 8.2గా నమోదైంది. రిక్టర్‌ స్కేల్‌ పై 8.2 గా నమోదు కావటంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. నేషనల్‌ సునామీ వార్నింగ్‌ సెంటర్‌(ఎన్‌ టీడబ్ల్యూసీ) దక్షిణ పెనిసులా, పసిఫిక్‌ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. హవాయ్‌ రాష్ట్రంలో సునామీ వాచ్‌ హెచ్చరికలు ఇచ్చింది.

రాత్రి 10.15 గంటల సమయంలో పెర్రివిల్లెకు తూర్పు-ఆగ్నేయంలో 56 మైళ్ల (91 కిలోమీటర్లు) దూరంలో, భూమికి 29 మైళ్ల లోపతులో సంభవించిన భూకంప కేంద్రాన్ని యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అధికారులు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత అదే ప్రాంతంలో అదే ప్రాంతంలో రిక్టర్‌ స్కేలుపై 6.5.. 5.6 తీవ్రతతో మరో రెండుస్లారు భూమి కంపించిందని పేర్కొంది.

యూఎస్‌ హవాయి, ఇతర అమెరికా, కెనడియన్‌ ఫసిఫిక్‌ తీర ప్రాంతాలకూ సునామీ ముప్పు ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. అయితే, భూ ప్రకంపనలతో ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. కాగా 1964లో 9.2 తీవ్రతతో ఇక్కడ భూకంపం సంభవించింది. ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటి వరకూ నమోదైన అతి తీవ్రమైన భూకంపం అని అధికారులు తెలిపారు.దీని తీవ్రత అలాస్కా గల్ఫ్, యూఎస్ పశ్చిమ తీరాన్ని తీవ్రంగా నష్టపరిచింది. గురువారం మధ్యాహ్నం 1.27 గంటల ప్రాంతంలో హవాయ్‌ గవర్నర్‌ డేవిడ్‌ ఐగే ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ఫైనల్‌ అప్‌ డేట్‌ : అలాస్కాలో భూకంపం కారణంగా హవాయ్‌కి సునామీ వాచ్‌ హెచ్చరిక రద్దు చేయడమైంది అని తెలియజేశారు.