Begin typing your search above and press return to search.

శవంతో పెళ్లి.. వింత ఆచారం

By:  Tupaki Desk   |   11 Aug 2020 4:45 AM GMT
శవంతో పెళ్లి.. వింత ఆచారం
X
కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. కొత్త పోకడలు వస్తున్న ప్రతీసారి పాత సంప్రదాయాలకు మనం మంగళం పాడుతూనే ఉంటాం. కానీ అనాదిగా అడవులు, ఆవాసాల్లో బతుకుతున్న ఆదివాసీలు, గిరిజనులు, తెగల్లో మాత్రం పాత సంప్రదాయాలు ఇంకా పరిఢవిల్లుతూనే ఉన్నాయి. ఒక్కో చోట్ల ఒక్కో విచిత్రమైన సంప్రదాయం అమలులో ఉంటుంది.

ఆఫ్రికా దేశమైన దక్షిణ సూడాన్ లోని గిరిజన జాతుల్లో ఇప్పటికీ విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతోంది. అక్కడి మహిళల వివాహం వింతగా జరుగుతుంది. డింకా, న్యూర్ వంటి తెగల్లో సంప్రదాయం చాలా వింతగా ఉంటుంది. రేపో మాపో చనిపోయే వ్యక్తులను చూసి అక్కడి మహిళలకు వివాహం చేస్తారు. శవాలతోనూ వివాహం జరిపిస్తారు. అలా చేయడం వలన మహిళలు ఆరోగ్యంగా ఉంటారని వారి నమ్మకం.

అమ్మాయికి కాబోయే వరుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకొని వారికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఇక భర్త మరణించిన తరువాత ఆ ఇంట్లో ఉండే భర్త తమ్ముడు లేదా అన్నతో కలిసి జీవించాలనే నియమం ఉంది. వారితోనే సంసారం చేయాలి. భర్త చనిపోయిన మహిళ అక్కడ గౌరవంగా ఉంటుంది.

సుడాన్ లో మహిళకు పెళ్లి అయిన తరువాత కనీసం ఇద్దరు బిడ్డలను కనాలి. లేదంటే ఆ భర్త విడాకులు ఇచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే వింత సంప్రదాయం కూడా ఉంది.