Begin typing your search above and press return to search.

ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మావోయిస్టు రెక్కీ..? అందుకే పోలీసుల జల్లెడ?

By:  Tupaki Desk   |   29 Sep 2022 6:33 AM GMT
ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మావోయిస్టు రెక్కీ..? అందుకే పోలీసుల జల్లెడ?
X
తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. పొరుగున ఉన్న చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర నుంచి చాపకింద నీరులా తెలంగాణలోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఇంటెలిజెన్స్ సమాచారంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఇటీవల ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి మావోయిస్టులు తెలంగాణలో రెక్కీ నిర్వహించారని విశ్వసనీయ సమాచారం పోలీసులకు తెలిసింది. ఇది తెలిసి షాక్ అయిన పోలీసులు ఇప్పుడు మావోయిస్టులకు చెక్ పెట్టడం కోసం అడవులను జల్లెడ పడుతున్నట్టు సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో ధనిక, పేద మధ్య ఆదాయం అంతరాలు పెరిగాయని.. అన్యాయం, ఫాసిజం పెరుగుతున్నాయని మావోయిస్టులు లేఖలతో తెలంగాణలో కలకలం రేపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సరిహద్దుల్లో నక్సలైట్ల కార్యకలాపాలు పెరిగిపోయినట్టు నిఘావర్గాల ద్వారా వచ్చిన నివేదికలు రాష్ట్ర పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

తెలంగాణలోని ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మావోయిస్టులు టార్గెట్ చేసినట్టు సమాచారం. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లను మావోయిస్టు పార్టీ టార్గెట్ చేసి రెక్కీ నిర్వహించారని సమాచారం. దీనికోసమే మావోయిస్టు ముఖ్య నేతలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రవేశించినట్టు చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు విపరీతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారని తెలిసింది. సెర్చ్ ఆపరేషన్ లతో పట్టణాలు, గ్రామాల్లో బెంబేలెత్తిస్తున్నారు.

ఇక క్యాడర్ ను బలోపేతం చేయడంతోపాటు కొత్త వారిని మావోయిస్టు పార్టీలో చేర్చుకోవడానికి నాయకులు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణలోని ప్రవేశించినట్టు సమచారం. ఇప్పటికే మావోయిస్టు పార్టీలోని కొందరు పోలీసులకు లొంగిపోవడం.. వివిధ కారణాలు, వ్యాధులతో పలువురు మృతిచెందడంతో ఢీలా పడ్డ మావోయిస్టులు ఇప్పుడు బలోపేతం చేయడంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి రెక్కీ చేయడానికి తిరుగుతున్నట్టు సమాచారం.

తెలంగాణలోనే కాదు పక్కనున్న మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోనూ మావోయిస్టుల కార్యకలపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల నుంచి సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోయినట్టు తెలిసింది. తాజాగా అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహించి మావోయిస్టులు షాకిచ్చారు. ఈ కార్యక్రమాల్లో అడవుల్లోని 12 గ్రామాల ప్రజలు పాల్గొన్నారని తెలిసింది. ప్రజల మద్దతు ఎక్కువ కావడంతో పోలీసులు జల్లెడ పడుతున్నారు.

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో రాజకీయ నేతలు, అవినీతి అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. మావోయిస్టుల కోసం పోలీసులు సరిహద్దు జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మావోయిస్టుల అలజడి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో వణుకుపుట్టిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.