Begin typing your search above and press return to search.

దిశ త‌ల్లిదండ్రుల‌కు అండ‌గా ఉంటా

By:  Tupaki Desk   |   4 Dec 2019 6:44 AM GMT
దిశ త‌ల్లిదండ్రుల‌కు అండ‌గా ఉంటా
X
దిశ హ‌త్యాచార ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ పై స్పందించ‌ని సెల‌బ్రిటీనే లేరు. టాలీవుడ్ నుంచి అంద‌రు హీరోలు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప్ర‌భుత్వాలు - పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. నిందితుల్ని ప‌బ్లిక్ లో ఉరి తీయాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాజాగా మంచు హీరో వంతు. మంచు ఫ్యామిలీ లోనే ఎంతో ఎమోష‌నల్ గా ఉండే మ‌నోజ్ .. దిశ‌కు జ‌రిగిన అన్యాయాన్ని త‌ట్టుకోలేక‌పోయారు. ఎంతో ఎమోష‌న్ అయ్యారు. ఆమె త‌ల్లిదండ్రుల‌ను క‌లిసి ఓదార్చారు. త‌మ ఇంట పుట్టిన మ‌గ బిడ్డ‌గా అండ‌గా నిలుస్తాన‌ని భ‌రోసానిచ్చారు. ప్ర‌భుత్వాల‌ పై పోరాడాల్సి వ‌స్తే తాను ఉన్నాన‌ని హామీ ఇచ్చారు. ``దేశం ఎటు పోతోందో అర్థం కావ‌డం లేదు. చాలా డిస్ట్ర‌బ్ అయ్యాను. దుర్మార్గుల్ని వారం లోగా ఉరి తీయాలి. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ముగింపు ప‌ల‌కాలి!`` అంటూ ఆవేశం గానే స్పందించారు మ‌నోజ్.

ఏదైతేనేం.. ఎంతో గొప్ప‌ ఓదార్పు ఇది.. ఈ స‌మ‌యంలో మంచు హీరో చేసిన ప‌నికి అభిమానుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. వైద్యురాలు.. ఎంతో ఒద్దిక‌గా ఉండే కుమార్తెను పోగొట్టుకున్న ఆ త‌ల్లిదండ్రుల క‌డుపు కోతను అర్థం చేసుకుని మ‌రింత మంది సెల‌బ్రిటీలు అండ‌గా నిలవాల్సి ఉంటుంది. ఆ క్ర‌మం లోనే తెలుగు సినీప‌రిశ్ర‌మ నుంచి ప‌లువురు హీరోలు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌డం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం.అయితే పోలీసులు-ప్ర‌భుత్వాల్ని అప్ర‌మ‌త్తం చేసేందుకు.. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసుల‌కు అవ‌స‌రం మేర‌ స‌హాయం చేసేందుకు సెల‌బ్రిటీలు హీరోలు ఎలా సాయం చేయ‌బోతున్నారు అన్న‌ది కూడా ఇంపార్టెంట్.