Begin typing your search above and press return to search.

ట్రంప్ కి రాష్ట్రపతి విందు..అతిథుల జాబితాలో మాజీ ప్రధాని!

By:  Tupaki Desk   |   24 Feb 2020 12:21 PM GMT
ట్రంప్ కి రాష్ట్రపతి విందు..అతిథుల జాబితాలో మాజీ ప్రధాని!
X
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత భారత్ పర్యటనలో బిజీగా బిజీగా గడుపుతున్నారు. సోమవారం ఉదయం కుటుంబం తో సహా అహ్మదాబాద్ కి చేరుకున్న ట్రంప్ ..అక్కడినుండి 22 కిలోమీటర్ల భారీ రోడ్ షో లో పాల్గొని ప్రపంచంలోనే పెద్దయిన మొతెరా స్టేడియం లో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరైయ్యారు. మద్యంలో సబర్మతి ఆశ్రమాన్ని కూడా ట్రంప్ దంపతులు సందర్శించి ..అక్కడి విశిష్టతలు - విశేషాల గురించి మోడీని అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం లో ట్రంప్ - మోడీ మాట్లాడుతూ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఈ కార్యక్రమం తరువాత ట్రంప్ కాసేపు విశ్రాంతి తీసుకోని ఆగ్రాలోని తాజమహల్ ని చూడటానికి వెళ్లారు.

ఇకపొతే , ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకి రావడం తో అయన కోసం అన్ని పర్యాటకంగా ఏర్పాట్లని చేయించింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ మంగళవారం రాత్రి విందు ఏర్పాటు చేసారు. ఈ విందుకి హాజరు కాబోయే అతిధుల లిస్ట్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పలు విపక్ష నేతలను ఈ విందుకు ఆహ్వానించకపోయినా రాష్ట్రపతి ఇచ్చే విందులో మాజీ ప్రధాని మన్మోహన్‌ పాల్గొంటారని కొందరు భావిస్తున్నారు. అగ్రదేశాధినేత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి విందును బహిష్కరించాలని లోక్‌ సభలో విపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి నిర్ణయించిన క్రమంలో రాష్ట్రపతి ఇచ్చే విందుకు హాజరయ్యేందుకు సర్దార్జీ సంసిద్ధమవడం గమనార్హం. యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీని ఈ విందుకు ఆహ్వానం లేదు. ఒక ప్రతిపక్ష నేతకి రాష్ట్రపతి ఇచ్చే విందుకు ఆహ్వానం అందకపోవడం ఏమిటి అని మండిపడుతున్నారు. అసలు విపక్షాలకు చెందిన సీనియర్‌ నేతలను ఆహ్వానించే ఆనవాయితీని ఎందుకు పక్కన పెడుతున్నారంటూ చౌధరి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు.