బాల్క సుమన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉత్తవే!

Fri Jul 06 2018 15:49:35 GMT+0530 (IST)

విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మనసు దోచుకున్న బాల్క సుమన్ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఎన్నిక కావటం తెలిసిందే. ఫైర్ బ్రాండ్ నాయకుడి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆయనపై తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు మీద పడటం తెలిసిందే.సోషల్ మీడియాలో ఆయనపై సాగుతున్న ప్రచారం.. సర్య్కులేట్ అవుతున్న ఫోటోలన్ని అబద్ధాలేనన్న విషయాన్ని తాజాగా మంచిర్యాల సీఐ మహేశ్ వెల్లడించారు. బాల్క సుమన్ పై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చిన ఆయన.. తన భార్యతో సుమన్ దిగిన ఫోటోను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారన్నారు. సుమన్ సతీమణి స్థానంలో సంధ్య అనే అమ్మాయి ఫోటోను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారన్నారు.

ప్రముఖులను టార్గెట్ చేసే అలవాటున్న సంధ్య.. విజేత అనే అక్కాచెల్లెళ్లు బాల్క సుమన్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు వెల్లడించారు. మంచిర్యాలకు చెందిన వీరు ఎనిమిదేళ్లుగా పెద్దపల్లి.. గోదావరిఖని.. చంద్రాపూర్ లలో పలువురిని బ్లాక్ మొయిల్ చేశారన్నారు. వీరు బాల్క సమన్ ఇంటికి (హైదరాబాద్ లోని) వెళ్లి అక్రమంగా ప్రవేశించటంతో పాటు.. అక్కడి సిబ్బందిపైనా అనుచితంగా వ్యవహరించారన్నారు. తప్పుడు ఆరోపణల్ని మానుకోవాలన్న ఆయన.. నిజమైన ఆధారాలుంటే మాత్రం పోలీసుల వద్దకు రావాలని సూచించారు.