క్వారంటైన్ లో భర్త: ప్రియుడితో భార్య జంప్

Tue May 26 2020 23:00:01 GMT+0530 (IST)

Man in quarantine, wife elopes with lover

మహమ్మారి దెబ్బకు రెండు నెలలుగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో వారి చాటుమాటు వ్యవహారాలన్నీ బయటకొస్తున్నాయి.  కుటుంబాల మధ్య కలహాలు మొదలవుతున్నాయి.తాజాగా మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లాలో ఇదే తరహాలో ఓ వివాహేతర సంబంధం బయటపడింది. భర్త హోమ్ క్వారంటైన్ లో ఉన్న సమయంలో అతడి భార్య ప్రియుడితో పరార్ కావడం కలకలం రేపింది.

మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ ఢిల్లీలో నివాసముంటున్నాడు. ఏడాది క్రితం భార్యా పిల్లలతో కలిసి స్వగ్రామానికి వచ్చారు. అతడు మాత్రం ఢిల్లీలోనే ఉంటున్నాడు. భర్త అడ్డులేకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కూలీ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది.

లాక్ డౌన్ లో పనులన్నీ బంద్ అయిపోయి ఉపాధి పోయిన కారణంగా మహిళ భర్త ఈనెల 19న శ్రామిక్ రైల్లో ఢిల్లీ నుంచి ఛత్తర్ పూర్ చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం అతడు తన ఇంట్లోనే పై అంతస్తులో హోం క్వారంటైన్ లో ఉంటున్నాడు. భార్య - పిల్లలు కింద ఫ్లోర్ లో ఉంటున్నారు.

భర్త ఇంటికి వచ్చేయడంతో ఆమెకు ప్రియుడితో ఏకాంతంగా గడిపే సమయం దొరకలేదు. దీంతో విసుగుచెంది ఈనెల 24న రాత్రి వేళ భర్త ఉంటున్న గదికి గడిచపెట్టి ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది.

మరుసటి రోజు ఉదయం తల్లి కనిపించకపోవడంతో పిల్లలు తండ్రికి చెప్పారు. విచారించిన అతడికి ఆమె అక్రమ సంబంధం గురించి తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు వెతుకుతున్నారు.