Begin typing your search above and press return to search.

మన జీవితంలోనే దుర్భరం ఇప్పుడేనట..

By:  Tupaki Desk   |   23 Jan 2020 4:21 AM GMT
మన జీవితంలోనే దుర్భరం ఇప్పుడేనట..
X
మన జీవితం మొత్తం మీద టీనేజ్ లో, చిన్నప్పుడు మాత్రమే అత్యంత ఆనందంగా ఉంటాం. పెళ్లై, పిల్లలు, బాధ్యతలు, సంసార బాధ్యతలు తలకెత్తుకున్నా మొదట్లో కాస్త ఆనందం తగ్గుతుంది. అయితే జీవితం మొత్తం మీద మన ఆనందం ఆవిరైపోయే ఏజ్ ఒకటుంది. అదే 40-50 వయసు అట..

40వ సంవత్సరంలోకి వస్తున్న కొద్దీ సంతోషం తగ్గుతూ ఉంటుందట..మళ్లీ 50వ సంవత్సరం తర్వాత ఎక్కువ ఆనందంగా ఉంటామట.. మధ్యలో మాత్రం ఆనందం ఆవిరైపోతుంటుందని పరిశోధకులు గుర్తించారు.

జీవితపు ఆనందపు రేఖపై 134 దేశాల్లో సమగ్ర అధ్యయనం చేశారు డేవిడ్ బ్లాంచ్ ఫ్లవర్ అనే ఆర్థికవేత్త. ఈ మేరకు ‘నడి వయసు నైరాశ్యం’పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా జనాలు అత్యంత తక్కువ ఆనందంగా ఉండే వయసు అభివృద్ధి చెందిన దేశాల్లో 47.2 ఏళ్లని.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 48.2 ఏళ్లని ఆయన లెక్కగట్టారు. 47 ఏళ్లప్పుడు మనుషులు ఎక్కువ వాస్తవికంగా ఆలోచిస్తుంటారని బ్లాంచ్ ఫ్లవర్ తెలిపారు.

40 ఏళ్ల తర్వాత ఆనందం ఆవిరి కావడానికి ప్రధానంగా ఆర్థిక పరిస్థితులు - ఆర్థికంగా సఫలమవ్వలేకపోవడం.. కుటుంబ బాధ్యతలు - బంధాలు భారం కావడం.. పెద్ద బాధ్యతలు ప్రభావం చూపిస్తాయని బ్లాంచ్ ఫ్లవర్ తెలిపారు.