Begin typing your search above and press return to search.

హేమంత్ దారుణ హత్యకి అసలు కారణం ఇదే.. బయటపెట్టిన హేమంత్ తల్లి ఎం ఏంటంటే ?

By:  Tupaki Desk   |   25 Sep 2020 11:30 AM GMT
హేమంత్ దారుణ హత్యకి అసలు కారణం ఇదే.. బయటపెట్టిన హేమంత్ తల్లి  ఎం ఏంటంటే ?
X
తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య తరహాలో తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌ లో జరిగింది.హైదరాబాద్‌ చందానగర్ ‌లో నివాసం ఉంటున్న హేమంత్, అదే ప్రాంతానికి చెందిన అవంతి రెడ్డిని ప్రేమించాడు. ఇద్దరు పరస్ఫర అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లి అవంతి తండ్రి లక్ష్మారెడ్డికి ఏ మాత్రం నచ్చలేదు. తనను వ్యతిరేకించి పెళ్లి చేసుకోవడంతో ఆయన కోపంతో రగిలిపోయాడు. పరువు పోయిందని తెగ బాధపడ్డాడు. కిరాయి మనుషులతో హేమంత్ ని కిడ్నాప్ చేయించాడు. అనంతరం సంగారెడ్డిలో హత్య చేయించాడు. ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ పరువు హత్య గురించి పూర్తి వివరాలని చూస్తే ..

ఈ ఘటన పై అవంతి మాట్లాడుతూ .. హేమంత్, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నామని, మా పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఈ ఏడాది జూన్ 10న ప్రేమ వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే తల్లిదండ్రులతో రాజీ కుదిరింది. నాతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మా నాన్నకు రాసిచ్చేశాను. ప్రస్తుతం గచ్చిబౌలిలో నివాసముంటున్నాం. గురువారం సాయంత్రం మా ఇంటికి మా మేనమామలు, వదినలు, బావలు వచ్చారు. ఇంటికెళ్దామని చెప్పి ఆప్యాయంగా మాట్లాడారు. మేమిద్దరం మా కార్ లో వస్తాం.. మీరు మీ కారులో వెళ్లండి అని మేనమామలకు చెప్పాను. వారు వినలేదు. బలవంతంగా వారి కారులో హేమంత్ ‌ను నన్ను ఎక్కించుకున్నారు. మెయిన్ రోడ్డుపైకి వెళ్లిన తర్వాత మా ఇంటికి వెళ్లకుండా ఔటర్ రింగ్ రోడ్డుపైకి తీసుకెళ్లారు. ఆ సమయంలో హేమంత్ నేను కారులో నుంచి దూకేశాం.

కాసేపటికే మేనమామ యుగంధర్ రెడ్డి కారులో ఇద్దరు గుండాలు వచ్చి హేమంత్‌ను బలవంతంగా లాక్కెళ్లారు. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. నేను 100కు డయల్ చేయడంతో పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చింది. ఆ తర్వాత మిగతా బంధువులు నన్ను పట్టించుకోకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. నేను మా అత్తయ్య, మామతో కలిసి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాం అని అవంతి తెలిపింది. మొత్తంగా హేమంత్‌ ను యుగంధర్ రెడ్డి, ఇద్దరు గుండాలు హత్య చేసి సంగారెడ్డి జిల్లా కిష్టయ్యగూడెం వద్ద మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు.నల్గొండ జిల్లాలో ప్రణయ్‌ను హత్య చేసిన మారుతీరావు చివరకు ఏమయ్యారో అందరం చూశాం. హేమంత్‌ను చంపినవాళ్లను ఎన్ ‌కౌంటర్‌ చేయాలి. నన్ను ప్రేమించినవాళ్లు అయితే హేమంత్‌ను ఎలా చంపుతారు.

పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇలాంటి ఘటన జరిగేది కాదు. మమ్మల్ని కిడ్నాప్ చేశాక సాయం చేయాలని అర్థించినా ఎవరూ ముందుకు రాలేదు. మా తల్లిదండ్రులతో మమ్మల్ని కలుపుతారని అనుకున్నా.. నమ్మించి మోసం చేశారు. నా వల్లే ఇదంతా జరిగింది. నేనే లేకుంటే హేమంత్‌ ఇవాళ బతికి ఉండేవాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు... ఘటనా స్థలానికి వెళ్లి హేమంత్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. హేమంత్ మృతదేహం దొరికిన ప్రాంతంలో సంగారెడ్డి క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఈ కేసులో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ ఘటన పై హేమంత్ తల్లి మాట్లాడుతూ .. కులాలు వేరు కావడమే హేమంత్‌ హత్యకు కారణమని ఆరోపణలు చేసింది. సందీప్ ‌రెడ్డి, రాకేశ్‌ రెడ్డి, రంజిత్ ‌రెడ్డి, యుగేందర్ ‌రెడ్డి, విజయేందర్ ‌రెడ్డే తమ కుమారుడిని హత్య చేయించారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకొని కుమారుడిని పెంచుకున్నామనిఇంత దారుణానికి ఒడిగడతారని అనుకోలేదని , వారు పలుమార్లు ఇంటికి సైతం వచ్చి తమను బెదిరించారని, హేళన చేసి మాట్లాడారని ఆరోపించారు. గురువారం సాయంత్రం పదిమంది ఇంట్లోకి వచ్చి జంటను కారులో అపహరించారని తెలిపారు.