ఏమిటి దారుణం.. నడిరోడ్డుపై హైదరాబాద్ లో నరికినా దిక్కులేదా..?

Mon Jan 23 2023 13:03:14 GMT+0530 (India Standard Time)

Man Killed on Hyderabad Roads

2022 ఏడాదిలో నేరాలు తగ్గాయని ఇటీవల రిటైర్మైంట్ తీసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఆందోళన వాతావరణం లేదని అందరూ హర్షం వ్యక్తం చేశారు. కానీ ఇలా ప్రకటించిన నెల కూడా గడవకముందే హైదరాబాద్లో దారుణం జరిగింది. నడిసెంటర్లో పట్టపగలు ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. ఎవరూ చూసినా తమకేం కాదనే ధైర్యంతో ఆ వ్యక్తిపై దాడి దాడి చేశారు. వారు అనుకున్న విధంగానే ఆ రోడ్ నుంచి ఎంతో మంది వెళ్తున్నారు. కానీ ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ కొందరు ఇక్కడేదో సినిమా తీస్తున్నారన్నట్లుగా తమ సెల్ ఫోన్లలో ఆ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. దేశంలోని నివాస ప్రదేశాల్లో సురక్షితమైన ప్రదేశం హైదరాబాద్ అని ప్రభుత్వాలు చెబుతుండగా ఇంతటి దారుణం జరుగడం భయాందోళనను కలిగిస్తోంది.ఈ దారుణం జరుగుతుండగా ఓ  ట్రాఫిక్ కానిస్టేబుల్ చూశారు. కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పట్టించుకోనట్లు వెళ్లిపోయారు. ఆ తరువాత మరో కానిస్టేబుల్ అటువైపుగా వచ్చాడు. కానీ అప్పటికే దుండగులు చచ్చేదాకా కొట్టి వెళ్లిపోయారు. ఆ తరువాత సదరు కానిస్టేబుల్ 108 అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది.

బాధితుడు మరణించినట్లు వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఈ దారుణం జరిగిన సమయంలో 100కు ఎవరైనా కాల్ చేస్తే దారుణాన్ని అడ్డుకునేవాళ్లమని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఒక మనిషి ఎంతటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా పట్టించుకునే నాథుడు లేడని ఇక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది.

ఉద్యోగం వ్యాపారం వివిధ అవసరాల కోసం చాలా మంది హైదరాబాద్ కు వస్తుంటారు. వివాదాలు ఎన్ని ఏర్పడినా పోలీస్ స్టేషన్లు కోర్టులు పరిష్కారం చూపుతాయి. కానీ చాలా మంది తామే ఫైనల్ కోర్టు అంటూ ప్రత్యర్థులను చంపేదాకా వదలట్లేదు.

అయితే ఏ అర్ధరాత్రో ఎవరూ లేని ప్రదేశమో కాదు.. నగరం నడిబొడ్డున ఇంత కిరాతకంగా నరికి చంపేస్తుంటే సమాజం ఎటుపోతుందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు మరికొన్ని జరిగితే సురక్షితమైన హైదరాబాద్ కు బ్యాడ్ వచ్చే ప్రమాదం ఉంది.

తమకు వెంటనే సమాచారం ఇస్తే స్పందించే వాళ్లమని పోలీసులు చెబుతున్నారు. కానీ నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు శ్రద్ధ చూపడం లేదని అర్థమవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక దర్యాప్తు చేశారు. హతుడు సెల్ ఫోన్ డేటా ఆధారంగా అనుమానితులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే నిందితులు మాత్రం మరో పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో నిందితులు స్పష్టంగా కనిపిస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ దారుణం జరుగుతుండగా చాలా మంది కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ సెల్ ఫోన్లలో మాత్రం వీడియోను బంధించారు. ఆ తరువాత దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. సోషల్ మీడియాపై ఉన్న ఆసక్తి మరో వ్యక్తికి సాయం చేద్దామన్న ఆలోచన ఎవరికీ లేదని కొందరు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు అమాయకులు రోడ్డుపై వెళ్లాలంటేనే భయపడుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.     నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.