విడాకులు తీసుకున్న భార్యను వదలని భర్త.. ఏం చేశాడంటే?

Sun Jun 26 2022 20:00:01 GMT+0530 (IST)

Man In Agra Divorces His Wife And kills Her

ఇంట్లో ఏది జరిగినా ఏం కాదు కానీ.. పెళ్లాంతో గొడవలు ఉంటే మాత్రం తట్టుకోవడం కష్టం. అది ఉంటే అసలు ప్రశాంతతే ఉండదు. సంసారంలో గొడవలు భార్యా భర్త ఇద్దరికీ తీవ్ర నష్టం కలిగిస్తుంది. సర్దుకుపోలేని వారు తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా గొడవ పడని వారు విడాకులు తీసుకొని ఎవరి జీవితం వారు సంతోషంగా గడుపుతూ ఉంటారు.అయితే తాజాగా అగ్రాలోని ఒక వ్యక్తి భార్యకు విడాకులు ఇచ్చి ఇద్దరూ విడిపోయిన తర్వాత ఆమెపై కక్ష పెంచుకొని హత్య చేసిన ఘటన చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అగ్రాలోని నాగ్లామేవతిలోని అపార్ట్ మెంట్ లో ఘజియాబాద్ కు చెందిన రితికాసింగ్ అనే వివాహిత నివసిస్తోంది. ఇటీవల ఆమె హత్యకు గురైంది. 2014లో ఆమె ఫిరోజాబాద్ కు చెందిన ఆకాశ్ గౌతమ్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత కుటుంబంలో ఏర్పడిన కలతల కారణంగా 2018లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారిద్దరూ ఎవరి జీవితం వారు జీవిస్తున్నారు.

భర్తతో విడాకుల అనంతరం రితికాసింగ్ తన ఫేస్ బుక్ స్నేహితుడు విపుల్ అగర్వాల్ తో నాగ్లామేవతి అపార్ట్ మెంట్ లో కలిసి ఉంటోంది. ఇటీవల ఆమె మాజీ భర్త మరో ఇద్దరు మహిళలతో కలిసి రితికాసింగ్ ఉండే అపార్ట్ మెంట్ కు వచ్చి రితికాపై దాడికి ప్రయత్నించారు.  వారు రితికా ప్రియుడిపై కూడా దాడి చేశారు. అనంతరం రితికా కాళ్లు చేతులు కట్టేసి అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి తోసి చంపేశారు.

రితికా స్నేహితుడు విపుల్ అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్తలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశామని.. మరికొందరినీ అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రితికాసింగ్ ను అపార్ట్ మెంట్ నుంచి కిందకు పడేసిన సీసీ టీవీ ఫేటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.