కోడలితో మామ 'బం.. చిక్'.. కొడుకు ఏం చేశాడంటే!

Mon Dec 05 2022 09:37:33 GMT+0530 (India Standard Time)

Man Illegal Affair With Daughter in Law

కన్న కొడుకు.. అతనితో జీవితం పంచుకున్న కోడలు. పచ్చని సంసారం మనవళ్లు.. మనవరాళ్లు.. ఇంతకు మించి ఆ పెద్దాయని ఏం ఆశిస్తాడు. కన్న కొడుకు సంసారం పచ్చగా ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? ఇది కదా సాదారణంగా తమ బిడ్డల గురించి తండ్రులు కనే కల!కానీ ఇలా అయితే ఇప్పుడు ఈ విషయం తెరమీదకి వచ్చేది కాదు. ఎందుకంటే.. ఈ కేసులో కోడలిపై కన్నేసిన భర్త తండ్రి సొంత మామ.. ఆమెను పదేపదే వాడేసుకున్నాడు. పైగా ఆమెకు ముగ్గురు పిల్లలు. అంతా తన కొడుకు పిల్లలే. అయినా.. ఆ మామ మాత్రం తన శారీరక వాంఛలు తీర్చేసుకున్నాడు. ఈ వ్యవహారంలో కొడలు కూడా మౌనంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

అయితే.. ఎక్కడ తేడా కొట్టిందో ఏమో.. తండ్రి తతంగాన్ని కొడుకు కనిపెట్టేశాడు. తండ్రిని ఘోరంగా చంపేశాడు. పశ్చిమ బంగాల్.. సీతాల్కుచిలో జరిగిన ఘోరం సంచలనం సృష్టించింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మిథున్ తన తండ్రి(72)ని సుత్తితో కొట్టి చంపేశాడు. అయితే.. అనంతరం దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించాడు.

అయితే ఈ విషయం ఇరుగు పొరుగు వారిద్వారా తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని పరిశీలించి మృతుడి కోడలు కొడుకును ప్రశ్నించడంతో విషయం వెలుగు చూసింది. ఘటనాస్థలిలో సుత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ సుత్తినే నిందితుడు హత్యకు ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.