పిచ్చకు పరాకాష్ఠ?..సూర్యాపేటలో కుర్రాళ్ల మధ్య ప్రేమతో రచ్చ

Sun Dec 08 2019 10:06:51 GMT+0530 (IST)

Man Gets Gender Change Operation in Suryapet

కాలం తెచ్చే మార్పులు కొన్ని చూస్తే.. పిచ్చకు పరాకాష్ఠగా అనిపిస్తాయి. వెగటు పుట్టిస్తాయి. ఈ ప్రేమలేంది? ఈ రచ్చలేంది? అన్న భావన కలగక మానదు. ఓకే.. ఇద్దరూ అంతగా ఇష్టపడ్డారనుకుంటే ఇలా ఎందుకు చేస్తున్నట్లు? అన్న క్వశ్చన్లు కలుగక మానదు. సూర్యాపేటలో సంచలనంగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.  సూర్యాపేట మండలంలోని శివ (పేరు మార్చాం) అనే కుర్రాడు.. సూర్యాపేటకు చెందిన మరో కుర్రాడ్ని ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో తమ పెళ్లికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు వీలుగా శివ ముంబయికి వెళ్లి లింగమార్పిడి చేయించుకొని వచ్చాడు. ఇంత జరిగిన తర్వాత శివతో పెళ్లికి సదరు కుర్రాడు నో చెప్పేశాడు. మరో అమ్మాయిని పెళ్లాడేందుకు రెఢీ అయిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న శివ ఆ కుర్రాడి ఇంటికి వెళ్లి పంచాయితీ పెట్టాడు. దీంతో సదరు కుర్రాడి పెళ్లి ఆగిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే శివ శివసత్తుల కులానికి చెందిన కుర్రాడు. అతగాడు లింగమార్పిడి చేయించుకున్న వైనం ఇప్పుడు బయటకు పొక్కి.. అతడి గ్రామానికి చెందిన శివసత్తుల వారంతా కలిసి పంచాయితీ పెట్టారు.

తమకు చెందిన వాడు లింగమార్పిడి చేయించుకుంటే పూజలు చేసే హక్కును కోల్పోతారని తేల్చేశారు. నిష్టతో కొలుపులు చెప్పే మాకు నీ కారణంగా కళంకం ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శివ పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిగా మారింది. ఈ వ్యవహారం ఆ ఊళ్లో ఇప్పుడో రచ్చగా మారింది.