Begin typing your search above and press return to search.

ఈ హత్య గురించి తెలిస్తే దేవుడా అనకుండా ఉండలేరు!!

By:  Tupaki Desk   |   24 Jan 2021 8:30 AM GMT
ఈ హత్య గురించి తెలిస్తే దేవుడా అనకుండా ఉండలేరు!!
X
విన్నంతనే వణుకు పుడుతోంది. ఇదేం పోయే కాలం అన్న భావన చటుక్కున కలుగుతుంది. బంధాల మీదా.. అనుబంధాల మీద కొత్త అనుమానాలు పుట్టించే ఉదంతాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. అయితే.. అలాంటి వాటికి సైతం షాకిచ్చే తాజా ఉదంతం గురించి విన్నంతనే.. దేవుడా అనుకోకుండా ఉండలేం. సంచలనంగా మారిన ఈ హత్య వివరాలు తెలిసినంతనే ఒంట్లో ఒకలాంటి ఆవేదన పుట్టటమే కాదు.. మనం ఎక్కడికి వెళుతున్నా.. సమాజంలో అసలేం జరుగుతుందన్న సందేహాలు ముసురుకోక మానదు.

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని దేశాయిపేటకు చెందిన విజయ్.. రాంకీలు మంచి స్నేహితులు. ఇరువురు స్నేహితులు ఒకరింటికి మరొకరు వచ్చి పోతుంటారు. ఈ క్రమంలో విజయ్ కు రాంకీ పెద్దనాన్న కుమార్తె.. కాజీపేటకు చెందిన యామిని పరిచయమైంది. వీరిద్దరు ప్రేమలో పడ్డారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అయినప్పటికీ వారిద్దరూ శారీరకంగా దగ్గరైంది. ఇక్కడ వరకు ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ఇలాంటివి కామన్ గా మారాయి కాబట్టి.

అయితే.. ఓపక్క విజయ్ తో రిలేషన్ లో ఉన్న యామిని.. వరుసకు తమ్ముడైన రాంకీతోనూ శారీరక సంబంధాన్ని ఏర్పర్చుకుంది. వీరిద్దరూ వరంగల్ డాక్టర్స్ కాలనీలో అద్దెకు ఇంటిని తీసుకొని గుట్టుగా రిలేషన్ నడిపేవారు. ఓరోజు విజయ్.. తమ సొంతూరుకు యామినిని తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు మద్యం తాగి గొడవపడ్డారు. తాను విజయ్ తో కలిసినప్పటికి ఫోటోల్ని స్నేహితులకు పంపిస్తున్నాడని.. అతడి అడ్డు తొలగించాలని.. తమ రిలేషన్ కంటిన్యూ కావాలంటే ఇలా చేయక తప్పదని తమ్ముడ్ని ఒప్పించింది.

జనవరి నాలుగున విజయ్ ను తన ఇంటికి పిలిచాడు రాంకీ. వారిద్దరు కలిసి వివిధ ప్రాంతాల్లో కారులో తిరిగారు. ఐదో తేదీన గీసుకొండ శివారులో వీరిద్దరూ కల్లు తాగారు. మత్తులో ఉన్న విజయ్ ముఖం మీద రాంకీ బలంగా గుద్దాడు. అనంతరం కెనాల్ లో పడేసి.. తనకేమీ తెలీదన్నట్లుగా ఇంటికి వచ్చాడు. కెనాల్ లో పడిపోయిన రాంకీ నీటిలో కొట్టుకు పోయాడు. అతడి డెడ్ బాడీ ఈ నెల 7న వరంగల్ రూరల్ జిల్లా కొత్తగూడెం శివారుకు కొట్టుకొచ్చింది. గుర్తు తెలియని వ్యక్తిదిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

అదే సమయంలో తన కొడుకు కనిపించటం లేదని విజయ్ తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ షురూ చేశారు. విజయ్ కు సన్నిహితులైన స్నేహితుల్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో రాంకీని కూడా పోలీసులు విచారించారు. విషయం తేడాగా ఉండటంతో తమదైన ట్రీట్ మెంట్ తో అసలు విషయం బయటకు రావటంతో.. తాజాగా రాంకీని.. యామినిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యోదంతం పెను సంచలనంగా మారింది.