గవర్నర్ కే చుక్కలు చూపించిన మమత

Fri Nov 15 2019 17:11:55 GMT+0530 (IST)

మమతా బెనర్జీ.. బెంగాల్ టైగర్.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. అలాంటి పశ్చిమ బెంగాల్ సీఎం మమత.. అప్పట్లో ప్రధాని మోడీ హోంమంత్రి షాలకే ఎన్నికల వేళ చుక్కలు చూపారు. వారి హెలీక్యాప్టర్ దిగకుండా కండీషన్లు పెట్టారు. ఇక సొంత బెంగాల్ గవర్నర్ ను వదులుతుందా? అదే పనిచేసింది.బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ కు చుక్కలు చూపించింది సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ లోని ఫరక్కాలో ప్రొఫెసర్ ఎస్ఎన్.హెచ్ కాలేజీ రజతోత్సవ సభకు గవర్నర్ జగదీప్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం హెలీక్యాప్టర్ సమకూర్చాలని గవర్నర్ బెంగాల్ సీఎంవో కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు.

అయితే గవర్నర్ కోరినా బెంగాల్ సీఎం సీఎస్ ఈ విషయంలో స్పందించలేదు. దీంతో 600 కిలోమీటర్ల దూరానికి గవర్నర్ రోడ్డుమార్గాన వెళ్లాల్సి వచ్చింది. ఇలా గవర్నర్ ను మమత అవమానించడం రెండోసారి అని బెంగాల్ రాజ్ భవన్ అధికారులు మండిపడ్డారు.

ఈ సందర్భంగా గవర్నర్ తీరుపై మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న గవర్నర్లు బీజేపీ ప్రతినిధుల్లా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. బెంగాల్ గవర్నర్ ఇలానే వ్యవహరిస్తున్నారని అందుకే ఇలా చేసినట్టు ఫైర్ అయ్యారు.