Begin typing your search above and press return to search.

కరోనాకి వ్యాక్సిన్ కావాలంటే ఆధార్ తప్పనిసరి !

By:  Tupaki Desk   |   11 July 2020 9:50 AM GMT
కరోనాకి  వ్యాక్సిన్  కావాలంటే ఆధార్ తప్పనిసరి !
X
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. ఈ కరోనా వైరస్ భారినపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ కి సరైన వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టకపోయినప్పటికీ కొన్ని మందులను వాడుతున్నారు. అయితే , ప్రస్తుతం కరోనా కి వాడే వ్యాక్సిన్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోగులు తమకు డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వివరాలు, తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, అంగీకార పత్రాలు, కరోనా పాజిటివ్ రిపోర్టు, కాంటాక్ట్ డీటెయిల్స్ తదితరాలన్నింటీ సమర్పించవలసి ఉంటుంది.

యాంటీ వైరల్ డ్రగ్, రెమ్ డెసివిర్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ మెడిసిన్ టోసిలిజుమాచ్ కొనుగోలు , చేయాలంటే వీటిని సమర్పించాలంటూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సర్క్యులర్ జారీ చేసింది. కంపెనీల నుంచి వీటిని నేరుగా కొనుగోలు చేసిన అనంతరం కొన్ని ఆసుపత్రులు వీటిని దాచిపెడుతున్నాయని, అందువల్ల కొరత ఏర్పడుతోందంటూ ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందినట్టు మంత్రి రాజేంద్ర షీగ్నే తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ మందులు అవసరం లేనివారు ఎక్కువగా కొనుగోలు చేసి ఎక్కువ ధరకు బ్లాక్ లో అమ్ముతున్నట్టు కూడా తెలిసిందన్నారు. అయితే రోగుల నుంచి ఇన్ని డాక్యుమెంట్లు కోరడం మంచిది కాదని కొంతమంది డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.