Begin typing your search above and press return to search.

వింత.. మార్కెట్లోకి రోగనిరోధకశక్తి పెంచే చీరలు

By:  Tupaki Desk   |   14 Aug 2020 3:30 PM GMT
వింత.. మార్కెట్లోకి రోగనిరోధకశక్తి పెంచే చీరలు
X
కరోనా వేళ కషాయాలు.. హోమియో, ఆయుర్వేద మందులకు బాగా గిరాకీ వచ్చింది. ఇవన్నీ వాడితే తెగ రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఊదరగొడుతున్నారు. ఇమ్యూనిటీ పెంచేవి ఇవి అంటూ ఇప్పుడు మార్కెట్లోకి పదార్థాలు పోటెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే కరోనాను మరీ ఇలా క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. కరోనా వేళ షాపింగ్ మాల్స్ కు పెద్ద దెప్ప పడింది. అస్సలు దుస్తుల కొనుగోళ్లు బాగా నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్ లో వెరైటీగా రోగనిరోధక శక్తి పెంచే చీరలు మార్కెట్లోకి వచ్చిపడ్డాయి. ఇది చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ ఈ ఇమ్యూనిటీ బూస్టర్ చీరలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రకరకాల సుగంధ ద్రవ్యాలతో వీటిని తయారు చేశామని.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వీటిని ధరించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. ఫలితంగా కరోనా వైరస్ మన దరిచేరదంటున్నారు కార్పొరేషన్ అధికారులు.

భోపాల్ వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్ ఈ ప్రత్యేక మైన వస్త్రాలు తయారు చేశాడు. లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, రాయల్ జీలకర్ర, బే ఆకు వంటి సుగంధ ద్రవ్యాలను ఈ దుస్తుల తయారీకి వాడినట్లు వెల్లడించారు. ఇది వందల ఏళ్ల నాటి పురాతన పద్ధతి అని.. ఈ బట్టల వైరస్ వ్యాప్తి తగ్గిపోతుందని వినోద్ తెలిపారు. ఈ చీర ధర రూ.3వేల రూపాయలుగా నిర్ణయించారు.