బ్రేకింగ్: కరోనాను జయించిన ఎంపీ సీఎం

Tue Aug 11 2020 21:00:01 GMT+0530 (IST)

Breaking: MP CM conquered Pandemic

కరోనా మహమ్మారిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ జయించారు. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో చౌహాన్ కు నెగెటివ్ వచ్చిందని స్వయంగా ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు వైద్యసేవలు అందించిన డాక్టర్లు వైద్యసిబ్బందికి ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపారు. తాను కోలుకోవాలని ప్రార్తించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.కాగా సీఎం శివరాజ్ కు నెగెటివ్ రావడంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. అలాగే వారం పాటు సీఎం ఐసోలేషన్ లో ఉండనున్నారు.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ కు జూలై 25న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన భోపాల్ లోని చిరయూ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. రెండోసారి పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. తాను ప్లాస్మా దానం చేస్తానని పేర్కొన్నారు.