అప్పుడెప్పుడో మైఖేల్ బెవాన్.. ఇప్పుడు ధోనీ

Tue Jan 22 2019 07:00:01 GMT+0530 (IST)

క్రికెట్ లో దిగ్గజాలు చాలా మంది ఉంటారు. వాళ్ల పేరుతో బోలెడన్నీ రికార్డులూ ఉంటాయి. వరల్డ్ కప్‌లు అందించిన అనుభవం కూడా ఉంటుంది. కానీ కేవలం వాళ్ల వల్లే మ్యాచ్‌లు గెలిచారా అంటే చెప్పలేని పరిస్థితి. కానీ క్రికెట్ చరిత్రలో ఇద్దరి వల్ల కచ్చితంగా మ్యాచ్ గెలవచ్చు అని గుండమీద చెయ్యివేసుకుని చెప్పొచ్చు. వాళ్లే.. ఒకడు మైఖేల్ బెవాన్ రెండు మహేంద్ర సింగ్ ధోనీ.1990ల్లో ఆస్ట్రేలియా టీమ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మైఖేల్. చాలా కామ్‌గా కన్పించే బెవాన్.. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలవడం అసాధ్యం అనుకున్న ఎన్నో మ్యాచ్‌లను అలవోకగా గెలిపించాడు. ఎంతమంది ఔట్ అవుతున్నా.. చివరి వరకు నిలబడి ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చెత్తో గెలిపించాడు. అప్పట్లో ఒక ఆటగాడి యావరేజ్ 40ల దగ్గర ఉన్న సమయంలో దాదాపు 60 యావరేజ్‌తో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండేవాడు మైఖేల్.

మైఖేల్ తర్వాత మళ్లీ అలాంటి ఫీచర్స్ ఉన్నవాడు ధోనీ. ధోనీ మైఖేల్ దాదాపుగా ఇంచుమించు ఒకే హైట్. ధోనీ కూడా అంతే పర్‌ఫెక్ట్ మ్యాచ్ ఫినిషర్. వరల్డ్ కప్ ఫైనల్‌లో విన్నింగ్ రన్‌ని సిక్స్ తో ముగించాలంటే ఎంత ధైర్యం తెగువ కావాలి. అవన్నీ ధోనీలో మెండుగా ఉన్నాయి. ఇక ఓపెనింగ్ మిడిల్ ఆర్డర్ లాస్ట్ ఓవర్స్.. ఎక్కడ దిగినా.. ధోనీ మ్యాచ్‌ని కచ్చితంగా గెలిపిస్తాడన్న ధీమా ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆడిన ఆటతీరుని ఎవ్వరైనా మర్చిపోగలరా. అందుకే ధోనీ ప్రతిభను ఐసీసీ గుర్తించింది. తన ట్విట్టర్ కవర్ పేజీపై ధోనీ ఫోటోని పెట్టింది. కెప్టెన్సీ పోయినా విమర్శకులు గద్దల్లా పొడుస్తున్నా అవేవీ పట్టించుకోకుండా తన ఆటను అద్భుతంగా ఆడగల ఏకైక ఆటగాడు ఒన్ అండ్ ఓన్లీ మిస్టర్ కూల్ ధోనీనే.