Begin typing your search above and press return to search.

ఎంపీ కోమటిరెడ్డి ఇంటపెళ్లి సందడి .. ఆ వైసీపీ నేత కొడుకుతో ఎంపీ కోమటిరెడ్డి కుమార్తె నిశ్చితార్థం !

By:  Tupaki Desk   |   5 Aug 2020 4:30 PM GMT
ఎంపీ కోమటిరెడ్డి ఇంటపెళ్లి సందడి .. ఆ వైసీపీ నేత కొడుకుతో ఎంపీ కోమటిరెడ్డి కుమార్తె  నిశ్చితార్థం !
X
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు , ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి కూతురు నిశ్చితార్థ వేడుక చాలా ఘనంగా , అట్టహాసంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ , కర్నూల్ జిల్లాకి చెందిన వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేత శిల్పా మోహన్‌ రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్‌ రెడ్డి కుమారుడికి ఆమెను ఇచ్చి వివాహం జరిపించేందుకు ఇరువర్గాల కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఇరుకుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయినట్టు సమాచారం. కరోనా నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా చేశారు. ఈ వేడుకకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దివంగత నేత , వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనకు చాలా సన్నిహితంగా మెలిగేవారు. ఆ సమయంలోనే సీఎం జగన్ తో కూడా మంచి అనుబంధం ఏర్పడింది.