Begin typing your search above and press return to search.

సీబీఐకి ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

By:  Tupaki Desk   |   5 Dec 2022 6:31 AM GMT
సీబీఐకి ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
X
ఢిల్లీ మద్యం కేసులో రేపు 6వ తేదీన తమ ముందు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన సీబీఐకి కల్వకుంట్ల కవిత ట్విస్ట్ ఇచ్చింది. మంగళవారం విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ రాసింది. ఈ మేరకు ఆ లేఖ విడుదల చేసింది. ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా హాజరుకాలేనని లేఖలో కవిత పేర్కొన్నారు. ఈనెల 11, 12, 14,15 తేదీలలో అందుబాటులో ఉంటానని తెలిపారు.

సీబీఐ నుంచి నోటీసు అందగానే హైదరాబాద్ లోని తమ ఇంట్లో విచారణకు సిద్ధమని ఇటీవల కవతి ప్రకటించారు. సీబీఐకి కవిత లేఖ రాశారు. ఎఫ్ఐఆర్ తోపాటు ఫిర్యాదు కాపీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సంబంధిత అనుబంధ కాపీలను ఇవ్వాలన్నారు.శనివారం ఉదయం ప్రగతి భవన్ కు వెళ్లి తన తండ్రి, సీఎం కేసీఆర్ తో తనకు వచ్చిన నోటీసులపై చర్చించారు.

ఈ సందర్భంగా పలువురు న్యాయనిపుణులతోనూ కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలోనూ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ డీటైల్స్ కాపీలు తీసుకోవాలని లేఖ రాయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కవిత లేఖ రాశారు. సమాచారాన్ని మీడియాకు ఇచ్చారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీబీఐకి కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు కాపీతోపాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు.

దీంతో సీబీఐ అధికారులు వెబ్ సైట్ లో ఎఫ్ఐఆర్ కాపీ ఉందని ఈమెయిల్ ద్వారా ఆమెకు తెలిపారు. దీనిపై స్పందించిన కవిత.. మళ్లీ సీబీఐకి లేఖ రాశారు. సీబీఐ వెబ్ సైట్ లో ఎఫ్ఐఆర్ కాపీని క్షుణ్ణంగా పరిశీలించాను. అందులో నా పేరు లేదు. అయినా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా.. ముందుగా ఖరారైన కార్యక్రమాల దృష్ట్యా మంగళవారం 6వ తేదీన విచారణకు హాజరుకాలేదు. ఈనెల 11, 12, 14,15 తేదీలలో అందుబాటులో ఉంటానని తెలిపారు.

సీబీఐ విచారణకు చెప్పిన టైంకు రానని కవిత చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సీబీఐ ఏం నిర్ణయిస్తుంది? ఎలాంటి స్టెప్ వేస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.