ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

Mon Mar 01 2021 10:27:07 GMT+0530 (IST)

MLA Rajaiah sensational Comments

మాజీ డిప్యూటీ సీఎం టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంక్షేమ పథకాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేసినా.. ముందుగా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలంటే పార్టీ సభ్యత్వం ఉన్నవారికే పింఛన్లు రేషన్ కార్డులు డబుల్ బెడ్ రూం ఇళ్లు లాంటి పథకాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు.

టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాలు నియోజకవర్గాల వారీగా టార్గెట్లు పెట్టారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కో నియోజకవర్గానికి 50వేల చొప్పున సభ్యత్వాలు చేయించాలని లక్ష్యంగా పెట్టారు.  

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజయ్య ఈ కండీషన్ పెట్టి వివాదాస్పదమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రభుత్వం నుంచి అందించే పథకాల్లో పెద్దపీట వేస్తామని చెబుతున్నారు. తన సొంత ఆస్పత్రుల్లో వైద్యసేవల పరంగా కూడా ఆఫర్లు ప్రకటించారు.

ప్రభుత్వం ద్వారా వచ్చే సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలు ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.