టీడీపీలో మరో వికెట్ డౌన్..!

Sat Jul 20 2019 11:02:39 GMT+0530 (IST)

టీడీపీలో మరో వికెట్ పడింది. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు పెరుగుతున్నాయి.  పలువురు సీనియర్ నేతలతోపాటు చోటమోటా నాయకులు తమ రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీకి గుడ్ బై చెప్పి బయటకు వస్తున్నారు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా  మలుచుకుంటోంది బీజేపీ.. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. ఈక్రమంలోనే వివిధ పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది.    ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే కీలమైన తూర్పుగోదావరి జిల్లాపై ఆ పార్టీ కన్నేసింది.  ఇక్క డ పార్టీని బలోపేతం చే సేందుకు బీజేపీ  నాయకత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేపట్టింది. వివిధ పార్టీల్లో ఉన్న నాయకులను పార్టీలోకి ఆ హ్వానిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ- కాంగ్రెస్- జనసేన పార్టీలతో సహా వివిధ రాజకీయపక్షాలకు చెందిన అసంతృప్తి నేతలకు వల వేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆ పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమా న్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు.

పార్టీ అగ్రనాయకులు సైతం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాల్లో పర్యటనలు సైతం చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే కొందరు నాయకులతో మంతనాలు జరిపి వారిని పార్టీలో చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా టీడీపీకి చెందిన పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది.  గన్నవరంలోని ఆయన ఆధ్వర్యంలో గతంలో నడిచిన టీడీపీ కార్యాలయాన్ని ఇప్పుడు బీజేపీ కార్యాలయంగా మార్చివేశారు.  ఇప్పటికే ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  రామ్ మాధవ్ తో టచ్ లో ఉన్నారని అంటున్నారు.

ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారడం ఖాయం కావడంతో పార్టీ కార్యాలయానికి బీజేపీ రంగులు వేసి ఆ పార్టీ జెండాలతో సిద్ధం చేస్తున్నారు. ఈనెల 24 లేదా 25 తేదీల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమలాపురం పట్టణానికి చెందిన రామ్ మాధవ్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. రామ్ మాధవ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి బీజేపీలో చేరతారని ఆయనతోపాటు కోనసీమలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలతో సహా... ఇతర నాయకులు కూడా కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది.