యువతితో చెప్పు దెబ్బలు తిన్న క్యాబ్ డ్రైవర్ అసెంబ్లీ బరిలో ..ఎందుకోసమంటే

Wed Nov 24 2021 11:01:55 GMT+0530 (IST)

Lucknow Cab Driver Thrashed By Girl To Contest Elections

కొన్ని రోజుల కిందట లక్నోలో ఓ యువతి క్యాబ్ డ్రైవర్ ను చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. రోడ్డు మధ్యలో ఓ అమ్మాయి క్యాబ్ డ్రైవర్ ని పాట్ మని చెంప పగలగొట్టింది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ అమ్మాయి క్యాబ్ డ్రైవర్ ను 22 చెంపదెబ్బలు కొట్టింది. ఆ సమయంలో ఈ వీడియో పై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. కొందరు అమ్మాయి కి మద్దతుగా నిలిస్తే మరికొందరు క్యాబ్ డ్రైవర్ కు అండగా నిలిచారు. ఆ దెబ్బలు కొట్టిన అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో తెలియదు గానీ.. దెబ్బలు తిన్న క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ మాత్రం మరోసారి చర్చీనీయాంశంగా మారాడు.అయితే ఈసారి మరెవరో కొట్టలేదు లేండి. క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. సా శివపాల్ యాదవ్ పార్టీలో చేరాడు. సాదత్ అలీ తాను తిన్న 22 చెంపదెబ్బల ప్రతిధ్వనిని ఇంకా మర్చిపోలేదు. అందుకే పురుషులకు కూడా న్యాయం జరిగేలా రాజకీయాల్లోకి వచ్చానని సాదత్ చెప్పుకొచ్చాడు. ఆ చెంపదెబ్బకు సంబంధించి ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని సాదత్ చెప్పుకొచ్చాడు. పురుషులకు అండగా ఉండేందుకే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యానని తెలిపాడు.

ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే .. గత జూలై 30న లక్నోలోని కృష్ణా నగర్ ప్రాంతంలోని అవధ్ కూడలి సమీపంలో సాదత్ అలీ ప్రియదర్శిని అనే అమ్మాయి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ప్రియదర్శిని డ్రైవర్ ను సమీపించి సాదత్ ను క్యాబ్ నుంచి కిందకు దింపి చెప్పుతో కొట్టడం ప్రారంభించింది. నాన్ స్టాప్ గా 22 చెంప దెబ్బలు కొట్టింది. యువతి క్యాబ్ డ్రైవర్ ను కొడుతుండగా కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడం విచారించండ యువతిని సైతం మందలించడం తతంగం అంతా అలా ముగిసిపోయింది. అయితే ఆ దెబ్బలను సాదత్ అలీ ఇంకా మర్చిపోలేదు. తనకు అన్యాయం జరిగిందని తప్పు లేకుండానే శిక్ష అనుభవించాల్సి వచ్చిందని సాదత్ ఆగ్రహంతో ఉన్నాడు. పురుషులకు అండగా ఉండేందుకే తాను రాజకీయాల్లో వచ్చినట్లు తాజాగా సాదత్ అలీ ప్రకటించాడు.