టీవీ నటితో లవ్ మ్యాటర్.. ఇంత రచ్చనా?

Wed Apr 21 2021 09:34:12 GMT+0530 (IST)

Love matter with TV actress

చిన్న విషయాలు చిలికి చిలికి గాలి వానలా మారటం ఈ మధ్యన చూస్తున్నాం. ప్రేమిస్తున్నామంటూనే సవాలచ్చ కండిషన్లు కూడా ఈ పరిస్థితికి కారణంగా చెప్పాలి. ప్రేమ వ్యవహారాల్లో అనుకోనిది ఏమైనా జరిగినప్పుడు.. వైల్డ్ గా రియాక్టు కావటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. తాజాగా ఒక టీవీ నటితో సహాయ దర్శకుడి ప్రేమ వ్యవహారమే దీనికి నిదర్శనంగా చెప్పాలి.ప్రేమ వ్యవహారంలో చోటు చేసుకున్న లొల్లి చివరకు.. కేసులు.. అరెస్టల వరకు వెళ్లటం గమనార్హం. చెన్నైకు చెందిన టీవీ నటి 24 ఏళ్ల జెనీఫర్. ఆమె చెన్నైలోని మనలి బాలాజీ పాలయానికి చెందిన వారు. రెండేళ్ల క్రితం.. శరవణ్ తో ఆమెకు పెళ్లైంది. కొద్దికాలానికే ఇద్దరి మధ్య విభేదాలు మొదలు కావటంతో భార్యభర్తలు దూరంగా ఉంటున్నారు. వారి మధ్యన విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. టీవీ సీరియల్స్ కు సహాయ దర్శకుడిగా పని చేసే పాతికేళ్ల నవీన్ కుమార్ తో జెన్నిఫర్ కు పరియమైంది. అది కాస్తా స్నేహంగా.. తర్వాత ప్రేమగా మారింది. అయితే.. అతడికి జెన్నిఫర్ కు అంతకు ముందే పెళ్లైందన్న విషయం తెలీదు. తాజాగా అతనికి తెలవటం.. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడి వరకు ఆగినా బాగుండేది. కానీ.. ఆవేశానికి గురైన నవీన్ కుమార్ తన స్నేహితులతో కలిసి.. జెన్నిపర్ మోసం చేసిందంటూ ఆమె ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేశారు.

దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన జెన్నిఫర్.. నవీన్ కుమార్ మీదా అతని స్నేహితులు (పాండియన్.. కార్తికేయన్) మీదా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రేమ ఏమిటో? అందులో దాపరికాలేమిటో? ఒకవేళ గతంలో జరిగిన పెళ్లి గురించి జెన్నిఫర్ చెప్పకుండా దాచి పెడితే.. నిలదీయటం వరకు ఓకే. కానీ.. ఇంటికెళ్లి గొడవ చేయటం..  లేనిపోని తలనొప్పుల్ని నెత్తి మీద వేసుకోవటం చూస్తే.. ప్రేమ వ్యవహారంలో మోతాదు ఎవరికి మంచిది కాదన్న భావన కలుగక మానదు.