ముక్కు చూసి పురుషాంగం సైజు చెప్పొచ్చట!

Thu May 06 2021 09:02:59 GMT+0530 (IST)

Look at the nose and tell the size of the penis

ప్రపంచంలో భిన్న దేశాలు భిన్న వ్యక్తులు ఉంటారు. అలాగే అందరూ ఒకే రంగులో.. ఒకే ఆకారంలో.. ఒకే సైజులో ఉండరు. ప్రాంతాలను బట్టి వారి వారి రంగు పరిమాణం ఆధారపడి ఉంటుంది. తాజా అధ్యయనంలో ముక్కు పరిమాణం బట్టి వారి పురుషాంగం సైజును అంచనావేయచ్చని తేలింది.పెద్ద ముక్కుగల పురుషుల అంగం పొడువుగా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ముక్కు పెద్దగా ఉండే పురుషుల అంగం సైజు 5.3 ఇంచుల వరకు పొడువు ఉంటుందని పరిశోధకులు తేల్చారు. బేసిక్ అండ్ క్లినికల్ ఆండ్రాలజీలో ప్రచురించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పురుషుల శవాలపై అధ్యయనం చేసి తేల్చారు.

మూడు రోజుల లోపు చనిపోయిన 126మంది పురుషుల అంగాల పరిమాణాన్ని కొలిచిన పరిశోధకులు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ముక్కు పెద్దగా ఉన్న పురుషుల అంగం స్తంభించిన తర్వాత సుమారు 5.3 ఇంచులు ఉండగా.. చిన్న ముక్కు ఉన్న పురుషుల అంగం 4.1 ఇంచులు ఉన్నట్లు కనుగొన్నారు. కేవలం అంగం సైజు మాత్రమే కాకుండా ఆయా వ్యక్తుల వృషణాల బరువు ఆయా వ్యక్తుల బరువు ఎత్తు తదితర విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే ముక్కుకు అంగానికి మధ్య సంబంధం ఏంటనేది తేల్చలేరు. ఇక చనిపోయిన శవాలకు అంగస్తంభన ఉండదు కదా అనేది కూడా డౌట్. కానీ వారి శరీర పరిమాణం బట్టి తేల్చారట..

ఇక అంగం సైజు విషయంలో మహిళలను ప్రశ్నించారు. ఎక్కువమంది ఎనిమిది ఇంచుల అంగంతో తమకు ఎక్కువ భావప్రాప్తి పొందుతున్నట్టు వివరించారు. అంగం సైజుతో పనిలేదని.. వారు ఎంత సేపు చేస్తే అంత సంతృప్తి భావప్రాప్తి కలుగుతోందని కొందరు పేర్కొన్నారు.