ఆమె నాకు డబ్బులిస్తుంది...లోకేష్ సంచలన కామెంట్స్

Wed Aug 10 2022 19:16:08 GMT+0530 (IST)

Lokesh sensational comments

నాకు డబ్బులు ఇచ్చేది ఆమె. నేను ఏమి కావాల్సి వచ్చినా ఆమెనే అడుగుతాను. ఆమె ఇస్తేనే నా దగ్గర డబ్బుండేది. నేను ఖర్చు పెట్టేది. ఇదీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన సంచలన కామెంట్స్.ఇంతకీ ఆమె ఎవరు అంటే ఆయన భార్య బ్రాహ్మణి. ఆమె మంచి సమర్ధురాలైన  వ్యాపారవేత్త అని కూడా చెప్పారు. ఇక  తన తల్లి భువనేశ్వరి భార్య ఈ  ఇద్దరే ఆర్ధిక శక్తులుగా తమ ఇంట్లో ఉన్నారని లోకేష్ చెప్పుకొచ్చారు.

తాను కారు కొనాలీ అంటే డబ్బులు అడిగేది తన భార్యనే అని ఆయన అంటున్నారు. తమ ఇంట్లో వారే స్త్రీ రూపాలుగా  ఉన్నారని అన్నారు. మంగళగిరిలో స్త్రీ  శక్తి ద్వారా మహిళలకు టైలరింగ్ బ్యూటీషియన్ కోర్సులు నేర్పించారు. వారికి సర్టిఫికేట్ల ప్రదానం చేసే కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ ఈ సందర్భంగా తన ఇంటి గురించి కూడా చెప్పుకొచ్చారు.

మహిళలను అంతా గౌరవించాలని ఆయన అన్నారు. వారే లక్ష్మీ దేవులు అని కూడా చెప్పారు. తాను ఎపుడూ మహిళలను కించపరచే విధంగా మాట్లాడింది లేదని కూడా గుర్తు చేశారు.

తన తల్లి గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా తాను వారి మీద ఎదురుదాడి చేయలేదని ఆయన అన్నారు. ఇక మహిళలకు మంచి చేయడానికి మనసు ఉండాలని అన్నారు. అందుకే మంగళగిరిలో చాలా మందికి  ఇలా సాయం చేస్తున్నామని చెప్పారు.

రేపటి రోజున అధికారంలోకి వస్తే లక్షలాది మంది మహిళలకు న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి లోకేష్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగానే కాకుండా చర్చను రేకెత్తించేలా ఉన్నాయని అంటున్నారు. ఈ యువ నాయకుడు సమయానికి తగినట్లుగా చేస్తున్న కామెంట్స్ తో ఒక వర్గం వారిలో పాజిటివిటీని పెంచుకుంటున్నారు అని అంటున్నారు.