డ్యాం ష్యూర్.. ఇది ముమ్మాటికీ జగన్ కోసమే...!

Tue Jan 24 2023 09:42:01 GMT+0530 (India Standard Time)

Lokesh padayatra targets only Jagan

అవును.. టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర ఎవరి కోసం .. అంటే.. ముమ్మాటికీ జగన్ కోసమేనని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ప్రస్తుతం యువగళం వ్యూహాన్ని పరిశీలిస్తే.. పాదయాత్ర 4 వేల కిలోమీటర్లు పయనించినా.. 400 రోజులు సాగినా.. ప్రజలను చైతన్య పరిచేది.. ప్రజలను కదిలించేది.. జగన్ కోసమే. అంతకు మించి ఏమీ కనిపించడం లేదు.ఇప్పుడు గతంలో జరిగిన పాదయాత్రలు పరిశీలిస్తే.. వైఎస్ నుంచి చంద్రబాబు జగన్ వరకు కూడా వారి వ్యూహాలు వారికి ఉన్నాయి. ప్రజలను కదిలించడం అంటే.. చంద్రబాబును అప్పట్లో వైఎస్ తిట్టిపోయలే దు.తన వ్యూహం చెప్పుకొచ్చారు. తాను అదికారంలోకి వస్తే.. ఏం చేస్తానో.. వైఎస్ వివరించారు. అంతేకాదు.. తాను తొలి సంతకం దేని మీద చేస్తానో కూడా ప్రజలకు వివరించారు. ఇది ఆయనపై నమ్మకం కలిగేలా చేసింది.

ఇక చంద్రబాబు చేసిన వస్తున్నా మీకోసం యాత్ర కూడా ప్రజలకు ఉన్న అవసరాలను గుర్తించింది. వారి కి సంబంధించిన సమస్యలను స్పృశించింది. వాటి పరిష్కారాలను ప్రస్తావించింది.

విభజిత రాష్ట్రాన్ని డెవలప్ చేయడంపై దృష్టి పెట్టింది. ఫలితంగా..  చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం కలిగించింది. ఇక జగన్ కూడా ఇదే పని చేశారు. ప్రజల సమస్యలను ఎక్కువగా ప్రస్తావించారు. తాను అధికారంలోకి వస్తే.. ఏం చేస్తానో చెప్పారు.

అయితే.. ఇప్పుడు నారాలోకేష్ ఏం చేయనున్నారు? అనేది చూస్తే.. జగన్‌ను ఎలా తిట్టాలనే విషయంపై ఆయన సిద్ధమవుతున్నారు. ఇంతకు మించిన సబ్జెక్టు ఆయనకు కనిపించడం లేదు.

పైగా.. ఎవరైనా ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే.. ఏం చేస్తారు?  ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో ఈయన ముఖ్యమంత్రి కాదు. పైగా.. పొత్తులు ఉంటే.. ముఖ్యమంత్రి ఎవరనేది కూడా.. అస్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ చేసే పాదయాత్ర ద్వారా జగన్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు. తెలుగులో ఒక సామెత ఉంది.. అతిగా తిట్టినా.. అతిగా పొగిడినా.. ప్రమాదమేనని!! మరి అతి ఏం చేస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.