Begin typing your search above and press return to search.

లోకేష్ మైలేజీ పోగొట్టుకున్నారే.. టీడీపీలో గుసగుస‌

By:  Tupaki Desk   |   22 Oct 2021 5:30 PM GMT
లోకేష్ మైలేజీ పోగొట్టుకున్నారే.. టీడీపీలో గుసగుస‌
X
టీడీపీలో ఒక ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. పార్టీ యువ నాయ‌కుడు.. భావి పార్టీ అధ్య‌క్షుడు.. మాజీ మంత్రి నారా లోకేష్‌.. మైలేజీ మిస్స‌య్యార‌నే అనే గుస‌గుస వినిపిస్తోంది. ప్ర‌స్తుతం పార్టీ అధినేత‌గా చంద్ర బాబుకు ప్ర‌త్యేకంగా రావాల్సిన మైలేజీ.. ఏమీలేదు. ఆయ‌న‌కు ఉన్న సింప‌తీ కావొచ్చు.. గుర్తింపు కావొచ్చు.. ప్ర‌జాద‌ర‌ణ కావొచ్చు.. కేంద్రంలోను.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ.. ఇతర పార్టీల్లోనూఆయ‌న‌కు ఉన్న ప‌లుకుబ‌డికి కొత్త‌గా మెరుగులు దిద్దాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికి ఉన్న సింప‌తీ చాలు. కానీ.. ఎంతో ఫ్యూచర్ ఉన్న నాయ‌కుడు లోకేష్‌కు చాలా మైలేజీ సంపాయించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇటు పార్టీలోనే కాకుండా.,. జాతీయ స్థాయిలోనూ లోకేష్ గుర్తింపు తెచ్చుకోవాలి. అదేస‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీ వైసీపీ నుంచి ఎదుర‌వుతున్న విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న చెక్ పెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌య‌త్నాల‌కు ఇప్పుడు జ‌రుగుతున్న దీక్ష‌కు భిన్న‌మైన తేడా ఉంద‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు. ఇది పార్టీ ప్ర‌తిష్ట‌కు.. ప్ర‌భుత్వంపై చేస్తున్న పోరాటానికి పెద్ద మైలురాయిగా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు చేస్తున్న దీక్ష‌ను స‌మ‌ర్ధిస్తున్న నాయ‌కులు.. అదేస‌మ‌యంలో లోకేష్ కూడా దీక్ష‌లో కూర్చుని ఉంటే బాగుండేద‌నే వాద‌న‌ను వినిపిస్తున్నారు.

``యువ నాయ‌కుడు.. ఎంతో ఫ్యూచ‌ర్ ఉంది. ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు.. ఆయ‌న‌ను చిన్న చూపు చూస్తున్నా రు. ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా దీక్ష చేస్తే.. మైలేజీ వ‌చ్చేది. పైగా వైసీపీ నేత‌ల నోళ్ల‌కు తాళం వేసిన‌ట్టు కూడా ఉండేది. ఈ వ‌య‌సులో చంద్ర‌బాబు దీక్ష చేస్తున్నారు. బాగానే ఉన్నా.. లోకేష్ కూడా దీక్ష‌కు కూర్చొని ఉంటే.. మ‌రింత బాగుండేది`` అని పేరు వెల్ల‌డించేందుకు ఇష్ట‌ప‌డ‌ని సీనియర్ మోస్ట్ నాయ‌కుడు.. ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రికి చెందిన ఎమ్మెల్యే ఒక‌రు వ్యాఖ్యానించారు. ఈయ‌న ఒక్క‌రే కాదు.. మెజారిటీ సీనియ‌ర్ల అభిప్రాయం కూడా ఇలానే ఉంది.

``లోకేష్‌.. ఇప్పుడు యూత్‌కు ఐకాన్‌. ఇప్పుడు జ‌రిగిన ఘ‌ట‌న కూడా యూత్‌కు సంబంధించిందే. సో.. ఆయ‌న కూడా దీక్ష‌లో కూర్చుని ఉంటే.. యూత్‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యేవారు.. ఆ ఎఫెక్ట్ వేరేగా ఉండేది! కానీ.. గొప్ప మైలేజీ మిస్స‌య్యారు`` అని అనంత‌పురానికి చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు దీక్ష‌కు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చిన నాయ‌కులు.. లోకేష్ విష‌యాన్ని ప్ర‌ధానంగా చ‌ర్చించు కున్నారు. లోకేష్ జాతీయ‌స్థాయిలో గుర్తింపు పొందేందుకు ఇది మంచి అవ‌కాశ‌మ‌ని ఎక్కువ మంది నాయ‌కులు అభిప్రాయ‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. అయితే.. లోకేష్ దీక్ష‌లో క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.