Begin typing your search above and press return to search.

ఒకే ఒక్కడి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ .. ఆ తర్వాత ఏమైంది ?

By:  Tupaki Desk   |   22 Nov 2020 1:30 AM GMT
ఒకే ఒక్కడి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ .. ఆ తర్వాత ఏమైంది ?
X
కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన తర్వాత , దాన్ని ఎలా ఆపాలో తెలియక ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళింది. ఇప్పటికి కొన్ని చోట్ల ఇంకా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. అయితే , ఈ లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం , అలాగే ప్రజలు ఆకలితో అలమటిస్తుండటం తో చాలా దేశాల్లో లాక్ డౌన్ కి సడలింపులు ఇచ్చేసారు. ఇదిలా ఉంటే ,ఓ వ్యక్తి ఒకే ఒక్క అబద్దం చెప్పటం వల్ల మరోసారి లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు లాక్ డౌన్ ఎక్కడ ,ఎందుకు విధించారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ..

సౌత్ ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తికి ఈ మద్యే కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీనితో కరోనా చైన్ ను తెంపడానికి అధికారులు రంగంలోకి దిగారు. అతన్ని ఎవరెవరు కలిశారో తెలుసుకోవడానికి అధికారులు వెళ్లారు. అలా అతన్ని కలిసివారందరినీ ఐసోలేషన్‌ లో పెట్టాలని నిర్ణయం తీసుకోని ఆ విధంగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ విచారణ లో ఓ పిజ్జా షాపు పేరు బయటకొచ్చింది. తాను పిజ్జా కొనుక్కోవడానికి ఓ షాపుకు వెళ్లానని.. పనిచేస్తున్న ఓ వ్యక్తికి అప్పటికే కరోనా సోకి ఉందని తెలిపాడు. దీంతో ఒక్కసారి షాపుకు వెళ్తేనే కరోనా సోకిందంటే.. ఈ మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు ఆందోళన చెందారు. ఇక ఆ షాపుకు ఎవరెవరు వెళ్లారో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.

ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే లాక్ ‌డౌన్ విధించాలని నిర్ణయించుకుంది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోందని..హెచ్చరికలు జారీ చేసింది. అయితే చివరికి తేలిందేంటంటే.. అధికారులతో మాట్లాడిన వ్యక్తి అబద్ధం చెప్పాడు. అతను పిజ్జా కొనుక్కోవడానికి ఒక్కసారి వెళ్లానన్న షాపులోనే అతను కూడా పనిచేస్తున్నాడు. అంటే కరోనా సోకిన కొలీగ్‌ తో చాలా రోజులుగా పని చేయడం వల్లే అతనికి కరోనా సోకిందని దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్నిఆ వ్యక్తి దాచి పెట్టి అబద్ధమాడాడు. దీన్ని నమ్మేన అధికారులు వైరస్ తీవ్రత ఎక్కువైపోయిందని వణికిపోయారు. అసలు విషయం తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ వ్యక్తికి ప్రస్తుత ఈ కోరోనా పరిస్థితుల్లో బాధ్యత ఉందని ప్రతీ ఒక్కరూ అలా బాధ్యతగా వ్యవహరిస్తే ఇటువంటి అనర్ధాలు జరగవని..అతను నిజం చెప్తే అసలు ఇంత గొడవ ఉండేదే కాదని స్థానిక అధికారులు చెప్తున్నారు. అతను చేసిన పనివల్ల అనవసరంగా ఆరురోజుల పాటు లాక్‌ డౌన్ విధించాల్సి వచ్చిందని చెప్పారు.