Begin typing your search above and press return to search.

తొలిరోజే బాబుకి షాక్ ...అడుగుపెట్టగానే కేసు !

By:  Tupaki Desk   |   26 May 2020 4:42 AM GMT
తొలిరోజే బాబుకి షాక్ ...అడుగుపెట్టగానే కేసు !
X
రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ ‌లోకి అడుగుపెట్టిన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు తొలిరోజే షాక్ తగిలింది. హైదరాబాద్ నుంచి కాన్వాయ్ లో బయలుదేరిన ఆయన.. దారి పొడవునా లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారని, చాలా చోట్ల జనం గుమ్మికూడటం, కారు దిగి మరీ వాళ్లను పలకరించడం ద్వారా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమయ్యారంటూ తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో బాబుపై ఫిర్యాదు నమోదైంది.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది చిత్తూరు జిల్లాకు చెందిన మొహమ్మద్ అలి అనే వ్యక్తి. ఫిర్యాదు కాపీలో తనను తాను సోషల్ వర్కర్ అని చెప్పుకున్న అలి.. సోమవారం చంద్రబాబు రాక సందర్భంగా సాక్షి టీవీలో ప్రసారమైన దృశ్యాలు, లాక్ డౌన్ నియమనిబంధనల ఆధారంగా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఆ ఫిర్యాదుకు సంబంధించిన కాపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దీనిపై తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదైనట్లు కూడా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే చంద్రబాబు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఏకంగా హైకోర్టుకే ఫిర్యాదు చేయడం గమనర్హం. లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారంటూ అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, వాళ్లపై కేసుల నమోదుకు ఆదేశాలు జారీచేసిన దరిమిలా ఇప్పుడు చంద్రబాబు వ్యవహారంలో ప్రభుత్వం ఎలా స్పందింస్తుందనేది కీలకంగా మారింది. కాగా ఇవాళ విశాఖకు వెళ్లనున్న చంద్రబాబు అక్కడ స్టెరీన్‌ గ్యాస్‌ బాధితులను కలవనున్నారు. అంతకముందు మార్చి 22న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్లారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడం తో అక్కడే ఉండిపోయారు. ప్రన్తుతం లాక్‌డౌన్ 4లో ఆంక్షలను సడలించడంతో తిరిగి ఏపీకి వచ్చారు