Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : ఒకేసారి కాదు .. దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేత !

By:  Tupaki Desk   |   2 April 2020 10:50 AM GMT
బ్రేకింగ్ :  ఒకేసారి కాదు .. దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేత !
X
కరోనా వైరస్ .. ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచంతో పాటుగా భారత్ ని కూడా పట్టి పీడిస్తుంది. చైనాలోని వుహాన్ సిటీలో మొదలైన ఈ మహమ్మారి ఆ తరువాత ఒక్కో దేశం విస్తరిస్తూ..ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. దీనితో ప్రపంచంలోని మెజారిటీ దేశాలు లాక్ డౌన్ ని అమలు చేస్తున్నాయి. ఆ తరువాత కరోనా వైరస్ ప్రభావం భారత్ లో కూడా మొదలు కావడంతో ...భారత్ లో ప్రధాని మోడీ లాక్ డౌన్ ని అమల్లోకి తీసుకువచ్చారు. అసలు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ని అమల్లోకి తీసుకురావడానికి మరో ముఖ్యకారణం ...కరోనా వైరస్ కి సరైన మందు లేకపోవడం.

కరోనా వైరస్ చైనా లో బయటపడి ..ఇప్పటికి దాదాపుగా 4 నెలలు కావొస్తున్నా కూడా ఈ కరోనా వైరస్ కి సరైన మందు కనిపెట్టలేకపోతున్నారు. కరోనా మందు కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ , ఇప్పుడిప్పుడే కరోనా కి మందు తయారు అయ్యేలా కనిపించడంలేదు. కానీ, కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా పెరుగుతూనే ఉంది. ఇకపోతే మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తీసుకు వచ్చిన లాక్ డౌన్ సమయం ఏప్రిల్ 14 తో ముగియబోతుంది. ఈ నేపథ్యం లో ప్రధాని మోడీ... ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో ..ఆయా రాష్ట్రాలలో కరోనా ప్రభావం ఎలా ఉందొ అడిగి పూర్తీ సమాచారాన్ని తెలుసుకున్నారు. అయితే , కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు కాబట్టి ..దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను ఒకేసారి కాకుండా , దశల వారీగా ఎత్తివేయాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోడీని కోరారు. దేశంలో మెజారిటీ సీఎంలు లాక్ డౌన్ ఒకేసారి కాకుండా ...దశల వారిగానే ఎత్తివేయాలని కోరడంతో ప్రధాని కూడా ఆ విదంగా ఆలోచించే ఆస్కారం ఉంది. కాగా , దీనిపై ఇప్పటికే నీతి ఆయోగ్ కూడా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి.