Begin typing your search above and press return to search.

లిక్కర్ స్కాం అరెస్ట్ లు.. షేక్ అవుతున్న నేతలు

By:  Tupaki Desk   |   28 Sep 2022 5:59 AM GMT
లిక్కర్ స్కాం అరెస్ట్ లు.. షేక్ అవుతున్న నేతలు
X
దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కాం రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. సీబీఐ దూకుడుగా ముందుకెళుతుండడంతో నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా తొలి అరెస్ట్ కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఓన్లీ మచ్ లౌడర్ సీఈవోగా పనిచేస్తున్న 'విజయ్ నాయర్'ను ఈ కేసులో అరెస్ట్ చేయడం సంచలనమైంది.

ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్ మెంట్ రంగంలో సేవలు అందిస్తున్న సంస్థ 'ఓన్లీ మచ్ లౌడర్'. ఈ కంపెనీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే సంస్థ సీఈవోగా ఉన్న విజయ్ నాయర్ ను ఈ కేసులో ఏ5 నిందితుడిగా సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ నాయర్ కు చెందిన కీలక అధారాలు లభించడంతో మంగళవారం ముంబైలో ఉన్న ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. అదుపులోకి తీసుకున్న నాయర్ ను సీబీఐ ఢిల్లీకి తరలించింది.

మంగళవారం నుంచి అరెస్ట్ పర్వం మొదలుకావడంతో నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల రాజకీయ లింకులు ఉండడంతో ఇక్కడ కూడా ఎక్కువ చర్చనీయాంశం అవుతోంది.

సీబీఐ కేసులు నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా ఈ కేసులో విచారణ జరుపుతోంది. తమ బినామీల ద్వారా ఢిల్లీలో లిక్కర్ దందాలో పెట్టుబడులు పెట్టారన్న కోణంలో విచారణ చేస్తున్నారని అంటున్నారు.

ఇక బినామీలను ముందుపెట్టి అనధికారికంగా పెట్టుబడులు పెట్టి బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం ఈడీ అధికారులకు లభించిందని తెలుస్తోంది.

అనుమానిత సంస్థలు వాటికి సంబంధించిన లావాదేవీలపై గుట్టు రట్టు చేసే పనిలో ఈడీ అధికారులు ఉన్నారని సమాచారం.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే ఈడీ హైదరాబాద్ లోని పలువురి ఇళ్లలో సోదాలు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఏ14గా ఉన్న మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఆయన వ్యాపార భాగస్వామిలుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. ఈడీ పలువురిని ఢిల్లీలో ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రశ్నించిన వారిని అరెస్ట్ లు చేస్తే ఇటు తెలంగాణ, ఏపీ అధికార పార్టీలు అభాసుపాలు కావడం ఖాయం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.