Begin typing your search above and press return to search.

తెలంగాణలో రూ. 1,864.95 కోట్ల లిక్కర్ తాగేశారట !

By:  Tupaki Desk   |   5 Jun 2020 7:15 AM GMT
తెలంగాణలో రూ. 1,864.95 కోట్ల లిక్కర్ తాగేశారట !
X
దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేది మద్యమే అని మరోసారి నిరూపితమైంది. దేశానికీ సగానికి సగం ఆదాయం కేవలం మద్యం మీదే అవుతుంది. అయితే, లాక్ డౌన్ కారణంగా మద్యాన్ని పూర్తిగా మూసేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీనితో లాక్ డౌన్ నుండి మొదటగా సడలింపు ఇచ్చింది కూడా మద్యానికే. లాక్ డౌన్ నుండి సడలించిన తొలి నెలలో మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలోనే జరిగాయి. తెలంగాణలో మే 31 నాటికి (26 రోజుల్లో) రూ.1,864.95 కోట్ల విలువైన మద్యం కొనుగోళ్లు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.

ఇందులో రూ.800 కోట్ల విలువైన బీర్లు, రూ. 1,000 కోట్ల విలువైన లిక్కర్‌ అమ్ముడు పోయాయి. కాగా, ఎండలు మండిపోయిన మే నెలలో బీర్ల అమ్మకాలు తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి. లిక్కర్‌ మాత్రం ఎప్పటిలాగే అమ్ముడుపోవడం గమనార్హం. వైన్ షాపులు తెరిచిన మొదటి రోజు మే 06వ తేదీన రూ. 72 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి బయటకు వెళ్లింది. నెల ముగిసే సరికి రోజుకు రూ. 71 కోట్ల ఆదాయం లభించింది. పది రోజుల తర్వాత..కొనుగోళ్లు మరింత అధికమయ్యాయి.

మే 16వ తేదీన రూ. 100 కోట్లు, మే 26వ తేదీన అత్యధికంగా రూ. 140 కోట్లకు పైగా సరుకు డిపోల నుంచి వైన్ షాపులకు వెళ్లింది. మే నెల చివరి రోజున అత్యధికంగా రూ. 62 కోట్ల మద్యం అమ్ముడయ్యింది. మే నెలలో బీర్‌ ప్రియుల్లో ఉత్సాహం తగ్గిందని అమ్మకాలు చెబుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు లక్ష కేసుల బీర్లు, 1.30 లక్షల కేసుల లిక్కర్‌ అమ్ముడవుతుంది. అదే ఎండాకాలంలో అయితే బీర్ల అమ్మకాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మే నెలలో మరీ ఎక్కువగా రోజుకు 1.5లక్షలకు పైగా సగటున 50 లక్షల కేసుల బీర్‌ అమ్ముడుపోతుంది.