కొంచెం చూసుకోండమ్మా..భర్త లైవ్ లో ఉండగా నగ్నంగా దూసుకొచ్చిన భార్య

Sun Sep 27 2020 12:20:29 GMT+0530 (IST)

Let's take a look .. Wife naked while husband is in live

టీవీ నటుడు జర్నలిస్ట్  ఫాబియో పర్చాట్ ఇటీవల ఓ రాజకీయ నాయకుడితో సీరియస్గా లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ‘పొలిటికల్ లైవ్’ అనే మినీ సీరిస్ కోసం మాజీ బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి గుయిల్హెర్మే బౌలస్ను మొబైల్ ద్వారా లైవ్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. ఫాబియో మాంచి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఓ పొలిటికల్ లీడర్కూడా అంతే ఊపుతో సమాధానం చెబుతున్నాడు. ఇంతలో ఓ షాకింగ్ పరిణామం. సదరు జర్నలిస్ట్ భార్య బాత్రూం నుంచి నగ్నంగా బయటకు వచ్చేసింది. తన భర్త లైవ్లో ఉన్నప్పటికీ వెనకనుంచి వంగి వెళ్లింది. అయినప్పటికీ ఆమె లైవ్లో నగ్నంగా కనిపించింది. దీంతో ఆ రాజకీయనాయకుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. సదరు జర్నలిస్ట్గా కూడా బోరున నవ్వాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది.‘మొగుళ్లు లైవ్ ప్రొగ్రాం చేస్తున్నప్పుడు కాస్త చూసుకొని నడుచుకొండి తల్లీ’ అంటూ చురకలింటిస్తున్నారు నెటిజనులు. ఈ వీడియో ఇప్పటికే కొన్ని లక్షలవ్యూస్ సంపాదించుకున్నది. తాను వంగి వెళుతున్నాను కాబట్టి  కెమేరాలో కనిపించనని ఆమె భావించి ఉండొచ్చు. కానీ ఇలా బుక్కయిపోతానని ఆమె ఊహించి ఉండదు. కరోనా ఎఫెక్ట్తో జర్నలిస్టులు రాజకీయ నాయకులు ఇంట్లో నుంచే లైవ్ వీడియోలు ఇవ్వడంతో ఈ మధ్య ఇటువంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. జాగ్రత్త లేకుంటే బుక్ అయిపోతాం. ఏది ఏమైనా ఇటువంటి వ్యవహారాలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్లకు మాంచి టైంపాస్గా మారాయి.