Begin typing your search above and press return to search.

వైర‌ల్ వీడియోః క‌రోనా చైన్ ఇలా తెంచేద్దాం!

By:  Tupaki Desk   |   18 May 2021 3:30 PM GMT
వైర‌ల్ వీడియోః క‌రోనా చైన్ ఇలా తెంచేద్దాం!
X
దేశంలో నిత్యం ల‌క్ష‌లాది కేసులు పెరుగుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కేసుల‌ను తగ్గించేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఫ‌లితం ఉండ‌ట్లేదు. కీల‌క‌మైన‌ ప్ర‌జ‌ల స‌హ‌కారం స‌రిగా అంద‌క‌పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణం అన్న‌ది కాద‌న‌లేని అంశం. ఈ నేప‌థ్యంలో.. హైద‌రాబాద్ పోలీసులు వినూత్న ప్ర‌చారం నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ఈ క‌రోనా చైన్ ను ఎలా తెంచాలో ఆ వీడియో ద్వారా చ‌క్క‌గా వివ‌రించారు. ఈ వీడియోలో ఒక మంచు ప‌ర్వ‌తం ఉన్న ప్రాంతంలో చాలా పెంగ్విన్లు న‌డుచుకుంటూ వెళ్తున్నాయి. ఇలా వెళ్తున్న వాటిల్లో ఒక పెంగ్విన్ మంచు దిబ్బ‌ను ఎక్క‌లేక వెన‌క ఉన్న‌వాటిమీద‌ ప‌డిపోతుంది. అంతే.. ఓ సైకిల్ స్టాండ్ మాదిరిగా.. ఒక‌దానిపై ఒక‌టి ప‌డిపోతుంటాయి.

అయితే.. ఈ ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టిన మూడు పెంగ్విన్లు వెంట‌నే ప‌క్క‌కు జ‌రుగుతాయి. దీంతో.. ఆ చైన్ తెగిపోతుంది. అచ్చం ఇదేవిధంగా క‌రోనా చైన్ ను కూడా తెంచాల‌ని సూచిస్తున్నారు హైద‌రాబాద్ పోలీసులు.

క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు, పాజిటివ్‌ వ‌చ్చిన వారు త‌ప్ప‌కుండా ఐసోలేష‌న్లోనో, ఆసుప‌త్రిలోనో ఉండాల‌ని సూచిస్తున్నారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి, మిగిలిన వారికి కొవిడ్ వైర‌స్ అంటించొద్ద‌ని కోరుతున్నారు. అలా చేయ‌డం ద్వారా.. క‌రోనా చైన్ ను తెంచాల‌ని పిలుపునిస్తున్నారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.