తిరుమల ఘాట్ రోడ్డులో వాహనదారులపై చిరుత దాడి !

Tue Aug 04 2020 23:04:36 GMT+0530 (IST)

Leopard attack on motorists on Thirumala Ghat Road!

తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుత కలకలం రేపింది. అలిపిరి నుంచి 9వ కిలోమీటర్ వద్ద రెండో ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి చేసింది. దీని నుంచి ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కర్నాటకకు చెందిన భక్తుడు కొద్దిలో తప్పించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి టీటీడీ విజిలెన్స్ అధికారులు పెట్రోలింగ్ వాహనాన్ని పంపారు. ఈ మధ్యకాలంలో తిరుమలకు భక్తుల రాక తక్కువగా ఉండటం వాహనాల రద్దీ కూడా తగ్గడంతో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు.అయితే గతంలోనూ ఇదే ప్రాంతంలో చిరుత కొన్ని సార్లు కనిపించింది. కానీ ఈసారి ఏకంగా వాహనదారులపై దాడి చేయడంతో సంచలనంగా మారింది. అడవుల నుంచి వన్య మృగాలు కొండపైకి రావడం సర్వసాధారణమైంది. తిరుమల క్షేత్రం దట్టమైన శేషాచలం అడవుల్లో ఉందుకు ఓ కారణం. కాగా లాక్ డౌన్ సమయంలో జన సంచారం లేకపోవడంతో అడవి జంతువులు తిరుమల కొండపై ఎక్కువగా ప్రత్యక్షమయ్యాయి. అయితే ఆ తర్వాత అన్ లాక్ సమయంలోనూ జనాలు తిరుగుతున్నా.. అప్పుడప్పుడూ వన్య మృగాలు ప్రత్యక్షం అవుతున్నాయి.