Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్..జాగ్రత్త..! కానీ భయపడాల్సిన అవసరం లేదు..

By:  Tupaki Desk   |   4 Dec 2021 5:28 AM GMT
ఒమిక్రాన్..జాగ్రత్త..! కానీ భయపడాల్సిన అవసరం లేదు..
X
ప్రపంచాన్ని మరోసారి భయంలోకి నెట్టింది ఒమిక్రాన్. అత్యంత వేగంగా ఈ వైరస్ విస్తరిస్తోంది. అంతకుముందున్న వేరియంట్ కంటే ఇది ఐదురేట్ల జెట్ స్పీడ్ తో మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తోంది. కరోనా నివారణకు రెండు డోసుల టీకా వేసుకున్న వారిని సైతం ఒమిక్రాన్ వదిలిపెట్టడం లేదు. ఇప్పటి వరకు 38 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ ఆ తరువాత మరికొన్ని దేశాలకు వెళ్తుందనడంలో సందేహం లేదంటున్నారు వైద్య నిపుణులు. దీంతో చాలా దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై భారీ నిఘా పెట్టారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఒమిక్రాన్ మరణం నమోదు కాలేదని తెలిపింది. ఈ వైరస్ ను కొనుగొన్న సౌతాఫ్రికాలోనూ ఎవరూ చనిపోలేదని అక్కడి వైద్య శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదించారు.

గత నెల 25న దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ ను కొనుగొన్నారు. ఇదే నెల 9న సేకరించిన నమూనాకు జినోమ్ సీక్వెన్సింగ్ చేయంగా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అయితే 19 నుంచి 23 తేదీల మధ్య దీనిని గుర్తించినట్లు నెదర్లాండ్ ప్రభుత్వం తెలుపుతోంది. దీంతో దక్షణిఫ్రికా, నెదర్జాండ్ దేశాల్లోనా అనేది స్పష్టత లేకుండా పోయింది. అయితే సౌతాఫ్రికా నుంచి ఇతర దేశాల్లోకి వెళ్లిన వారిలోనే ఇది ఇతర దేశాలకు వెళ్లినట్లు భావిస్తున్నారు. సౌతాఫ్రికాలో అధికారికంగా ప్రకటన వెలువడకముందే ఇతర దేశాల్లోకి వెళ్లినట్లు భావిస్తున్నారు.

అంతముందు 90 శాతం కేసులు నమోదు కావడానికి డెల్టా వేరియంట్ కారణమని వైద్యులు చెప్పారు. అయితే తాజాగా వెలుగుచూసిన ఒమిక్రాన్ అంతకంటే రెట్టింపు స్థాయిలో విస్తరింస్తోందని అంటున్నారు. గురువారం వరకు 29 దేశాల్లో ఉన్న ఒమిక్రాన్ రెండు రోజుల్లోనే మరో 10 దేశాల్లోకి విస్తరించింది. శుక్రవారం వరకు 39 దేశాల్లో దీనిని గుర్తించారు. దీంతో ఒమిక్రాన్ ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతోంది. అయితే దీని విస్తరణ మిగతా వేరియంట్ల కంటే ఐదు రేట్లు అధికంగా ఉందని తెలిపింది.

ఇక ఒమిక్రాన్ తో ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదని ప్రపంచ ఆరోగ్యం సంస్థ తెలిపింది. ఇది కొంచెం ఊరట కలిగించే విషయమని తెలిపింది. అయితే కొందరు వైద్యులు మాత్రం ఒమిక్రాన్ ఇప్పడే మొదలైందని, దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే నిర్దారణకు రావాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక దీనిని ఎక్కువగా యువతలోనే గుర్తించామంటున్నారు. ఇప్పుడిప్పుడే వృద్ధులకు కూడా విస్తరిస్తోంది. అప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేమంటున్నారు. యువతలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వారిలో మరణం కాకపోవచ్చని అభిప్రాయ పడుతున్నారు. కాగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిని ఒమిక్రాన్ వదిలిపెట్టడం లేదు. కర్ణాటకలో ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరు రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు.

ఒమిక్రాన్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలున్నా జాగ్రత్తలు పాటించాల్సిందేనని అంటున్నారు. కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని తెలిపింది. గతంలోనూ మొదట్లో వైరస్ వ్యాప్తి చెంది, ఆ తరువాత మరణాలు సంభవించాలని పేర్కొంది. అయితే ఇది వేగంగా వ్యాప్తిం చెందడంతోవారిలో ఉండే దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. మరణాలు సంభవించకపోవడానికి వ్యాక్సిన్ కూడా అడ్డుకుంటుందని అనుకోవచ్చని అంటున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఒమిక్రాన్ సోకినా మరణం నుంచి కాపాడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఈ సమయంలో జాగ్రత్తలు కూడా పాటించాలంటున్నారు.