Begin typing your search above and press return to search.

యోగికి మంచి శకునంగా మారిన సర్వే.. టాప్ 5లో లేని తెలుగు సీఎంలు

By:  Tupaki Desk   |   22 Jan 2022 5:00 AM GMT
యోగికి మంచి శకునంగా మారిన సర్వే.. టాప్ 5లో లేని తెలుగు సీఎంలు
X
దేశంలో బోలెడన్ని మీడియా సంస్థలు ఉన్నప్పటికీ.. భారీ ఎత్తున పొలిటికల్ సర్వేను.. అది కూడా లోతుగా చేసే విషయంలో ఇండియా టుడే మీడియా సంస్థకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. గతంలోపలు ప్రాంతీయ భాషల్లో మీడియా హౌస్ ను నడిపిన ఈ ప్రముఖ మీడియా.. .తర్వాతి కాలంలో ప్రాంతీయ భాషల్ని ఎత్తేయటం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లిషు.. హిందీల్లో మ్యాగ్ జైన్ పబ్లిష్ చేస్తున్నారు. పిరియాడికల్ గా లోతైన సర్వేను నిర్వహించటం.. భారీగా పబ్లిష్ చేసే అలవాటున్న ఈ మీడియా సంస్థ తాజాగా దేశ రాజకీయాలకు సంబంధించిన లోతైన సర్వేను నిర్వహించింది.

గమనించాల్సిన అంశం ఏమంటే.. కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహిస్తున్న వేళలోనే.. ఈ సర్వే ఫలితాలు విడుదల కావటం. అందులో.. మోడీకి యోగికి తిరుగులేదన్న విషయాన్ని ప్రజాబిప్రాయం వెల్లడించినట్లుగా పేర్కొనటం గమనార్హం. జాతీయ స్థాయిలో మోడీకి తిరుగులేదని తేల్చిన సర్వే.. రాష్ట్రాల విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు తిరుగులేని ప్రజాదరణ ఉందన్న విషయాన్ని వెల్లడించారు.

సర్వేలో వెల్లడైన ఫలితాల్లో దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో యూపీ సీెం ఆదిత్యనాథ్ కు 27.1 శాతం మంది ఓటేయగా.. తర్వాత స్థానంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు 19.9 శాతం మంది ఓటేశారు. మూడోస్థానంలో మమతా బెనర్జీ (10.8 శాతం) ఓటేయగా.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కు 6.7 శాతం.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కేవలం 4.9 శాతం మంది ఓటేశారు.

ఆసక్తికరంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరూ టాప్ ఫైవ్ లో లేరు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేరంటే అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం ఆయన ఫోకస్ మొత్తం ఏపీకే పరిమితం కావటం తప్పించి.. జాతీయ రాజకీయ అంశాల్ని అస్సలు పట్టించుకోరన్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం మీద ఫైట్ కు దిగిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టాప్ 5లో లేకపోవటం మాత్రం గమనార్హం. జాతీయ స్థాయిలో మోడీకి ప్రత్యామ్నాయంగా నిలవాలని.. ఆయనకు పోటీగా జట్టు కట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓపెన్ గా ప్రకటించటం.. అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతున్న ఆయన.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని మోడీ వ్యతిరేకుల్ని ఒకచోటకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఆయనకు జాతీయ స్థాయిలో ఎవరూ గుర్తించకపోవటం డ్యామేజ్ చేసే అంశంగా చెప్పక తప్పదు.