Begin typing your search above and press return to search.

ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎక్కడా లేని సరికొత్త సెటిల్ మెంట్ షురూ

By:  Tupaki Desk   |   28 Jan 2023 12:03 PM GMT
ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎక్కడా లేని సరికొత్త సెటిల్ మెంట్ షురూ
X
దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు ప్రబావంతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు దారుణంగా నష్టపోయిన వైనం తెలిసిందే. గ్రూపులోని పలు కంపెనీల షేర్ల విలువ దాదాపు 20 వాతానికి పతనం కావటం.. మార్కెట్ భారీ నష్టాల్ని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్పాతంతో స్టాక్ మార్కెట్ రక్తమోడిన పరిస్థితి.

తాజా నివేదిక కారణంగా రెండు రోజుల వ్యవధిలో అదానీ గ్రూపు మార్కెట్ విలువ ఏకంగా రూ.4.17 లక్షల కోట్లు క్షీణించిన నేపథ్యంలో.. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరెక్కడా లేని కొత్త సౌకర్యం దేశీయంగా స్టార్ట్ అయినా మీడియాలో ఫోకస్ లభించలేదు.

అందరి చూపు అదానీ షేర్లు.. తదనంతర పరిస్థితులు.. మార్కెట్ పతనం మీదనే ఎక్కువగా ఫోకస్ అయ్యాయి. మరోవైపు శుక్రవారం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ లో దాదాపు 200 కంపెనీలకు చెందిన షేర్లలో టీప్లస్ వన్ సెటిల్ మెంట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

ఈ విధానం ఏమంటే.. ట్రేడింగ్ ముగిసిన తర్వాతి పని దినాన.. షేర్ల కొనుగోలుదారులు.. అమ్మకందారుల ఖాతాల్లోకి నగదు.. షేర్లు జమ అవుతాయి. ప్రస్తుతం ఇది రెండు పని దినాలుగా ఉంటే.. అది ఒక రోజుకు తగ్గింది. ఈ విధానాన్ని తొలుత టాప్ 200 కంపెనీల్లో చేపడతారు. క్రమపద్ధతిలో మిగిలిన అన్ని స్టాక్ ల విషయంలోనూ ఇదే పద్దతిని అనుసరిస్తారు. ఈ విధానం ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరే దేశంలోనూ లేదని చెబుతున్నారు.

అదే సమయంలో మ్యూచువల్ ఫండ్ సంస్థ ఈక్విటీ పథకాల సెటిల్ మెంట్ విధానాన్ని కూడా మార్చనున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పథకాలకు రిడంప్షన్ కు టీప్లస్ 2 సెంటిమెంట్ విధానం అమల్లోకి రానుంది. అంటే.. ఈక్విటీ పథకాల యూనిట్లను అమ్మిన మదుపరుల బ్యాంకు ఖాతాల్లోకి మూడో రోజు నాటికి నగదు జమ కానుంది.

ప్రస్తుతం ఇది పది రోజులుగా ఉంది. అంటే.. వారం రోజులు ముందుగా డబ్బులు జమ కానున్నాయి. ఈ రెండు కీలక పరిణామాలకు అదానీ షేర్ల పతన హోరులో ఎవరికి వినిపించకుండా పోయిన పరిస్థితి. అదే సమయంలో.. మొదటి విధానం ప్రపంచ స్టాక్ మార్కెట్ లో మరే దేశంలోనూ అమలు కానిది కావటం మరో విశేషంగా చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.